E-Paper
Advertisement

Ozempic Drug :ఓజెంపిక్ కు బానిసలవుతున్న బాలీవుడ్.. ఓజెంపిక్ ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Ozempic Drug :ఓజెంపిక్ కు బానిసలవుతున్న బాలీవుడ్.. ఓజెంపిక్ ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Advertisement

Ozempic Drug: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేయటమే కాకుండా డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా ఓజెంపిక్ (Ozempic) పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీలు స్లిమ్ అవ్వటం కోసం ఈ ఇంజక్షన్లను ఉపయోగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. గతంలో తమన్నా ఇలా ఇంజక్షన్లు వాడటం వల్లే చాలా సన్నబడ్డారని వార్తలు రావడంతో ఈ వార్తలను ఆమె ఖండించారు తాను ఎలాంటి ఇంజక్షన్లు వాడలేదని క్లారిటీ ఇచ్చారు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి కోసమే ఓజెంపిక్..

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఈ ఓజెంపిక్ ఇంజక్షన్లు వాడి స్లిమ్ అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ఓజెంపిక్ అంటే ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. నిజానికి ఈ
ఓజెంపిక్ డ్రగ్ అనేది టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి కోసం రూపొందించినది. ఈ ఇంజక్షన్ రక్తంలోనే చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది తీసుకోవటం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఈ ఇంజక్షన్ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ విడుదలకు దోహదం చేస్తూ జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది. తద్వారా ఆకలి అనే భావన ఉండదు దీంతో శరీర బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

సులభంగా శరీర బరువు తగ్గడం..

Advertisement

ఓజెంపిక్ ఇంజక్షన్ శరీర బరువు తగ్గించడానికి దోహదపడుతుంది అంటూ డానిష్ శాస్త్రవేత్తలు కనుగొనడంతో ఈ ఇంజక్షన్ ప్రాధాన్యత పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున హాలీవుడ్ సెలబ్రిటీలు తమ శరీర బరువును తగ్గించుకొని స్లిమ్ గా కనిపించడం కోసం ఈ ఇంజక్షన్లను విరివిగా ఉపయోగించారు. ఇక ఈ సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిందని తెలుస్తోంది. ఇలా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఓజెంపిక్ ఇంజక్షన్ కు బానిసలుగా మారి వీటిని తీసుకుంటూ శరీర బరువు తగ్గుతున్నారు.

ఎక్కువ వాడితే ప్రమాదమే..

Advertisement

ఈ ఇంజక్షన్ తీసుకోవటం వల్ల శరీర బరువు చాలా తొందరగా తగ్గుతారు ముఖ్యంగా సెలబ్రిటీలు ఏదైనా ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొనాలనుకునే వారు రెడ్ కార్పెట్ల పై సందడి చేయబోతున్న సెలబ్రిటీలు ఈ ఇంజక్షన్లను వాడి శరీర బరువును నియంత్రణలో ఉంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంజక్షన్స్ విరివిగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఇలాంటి ఇంజక్షన్లు వాడే వాళ్ళు కేవలం డాక్టర్ల సలహా మేరకు ఉపయోగించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

Also Read: Mowgli Postponed : అఖండ 2 ఆగమనం… వెనక్కి తగ్గిన మోగ్లి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×