E-Paper
Advertisement

IKEA Phone Bed: ఫోన్ కోసం స్పెషల్ బెడ్ తయారు చేసిన ఐకియా.. దీన్ని కొనడం అంత ఈజీ కాదండోయ్!

IKEA Phone Bed: ఫోన్ కోసం స్పెషల్ బెడ్ తయారు చేసిన ఐకియా.. దీన్ని కొనడం అంత ఈజీ కాదండోయ్!
Advertisement

IKEA Phone Bed| మోడ్రన్ ఫర్నిచర్, గృహోపకరణాలు విక్రయించే ఐకియా తాజాగా ఒక స్పెషల్ మినీ బెడ్‌ను తీసుకొచ్చింది. ఈ బెడ్ కేవలం స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించబడింది. టెక్నాలజీ, ఆధునిక జీవనశైలి వల్ల క్వాలిటీ నిద్రను కోల్పోతున్న వారికి మంచి నిద్ర అందించడానికే దీన్ని తయారు చేశారు.

ఫోన్ స్లీప్ కలెక్షన్

చాలా మంది రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో స్క్రోల్ చేస్తారు. ఈ అలవాటు వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఐకియా ఈ మినీ బెడ్‌ను తీసుకొచ్చింది. ఈ చిన్న బెడ్‌పై మీ ఫోన్‌ను రాత్రివేళ “పడుకోబెట్టవచ్చు”. ఇదేదో పిల్లల ఆట వస్తువు కాదు. ఒక ఆహ్లాదకరమైన టెక్నికల్ పరిష్కారం.

మినీ బెడ్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఈ మినీ బెడ్ ఐకియా ఫర్నిచర్ లాగా కనిపిస్తుంది. ఇందులో చిన్న మ్యాట్రెస్, చిన్న బ్లాంకెట్ ఉంటాయి. ఈ బెడ్ లో ఒక NFC చిప్ ఉంటుంది. ఇది ఒక యాప్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫోన్‌ బెడ్‌పై ఉంచగానే NFC చిప్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్‌లో ‘డు నాట్ డిస్టర్బ్ మోడ్’ ఆన్ అవుతుంది.

ఫోన్ నిద్రను ట్రాక్ చేసే యాప్

ఈ యాప్ మీ ఫోన్ ఎంతసేపు బెడ్‌పై ఉందో ట్రాక్ చేస్తుంది. ఇది స్లీప్ ట్రాకర్ లాగా పనిచేస్తుంది. డిజిటల్ డిటాక్స్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది మీకు ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను అలవర్చుకోవడానికి సహాయపడుతుంది.

7 రాత్రుల చాలెంజ్

Advertisement

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా.. ఐకియా “7 రాత్రుల చాలెంజ్” నిర్వహిస్తోంది. ఈ చాలెంజ్‌లో.. ఏడు రాత్రుల పాటు ఫోన్‌ను ఉపయోగించకుండా.. రాత్రికి కనీసం 7 గంటలు ఫోన్‌ను మినీ బెడ్‌పై ఉంచాలి. ఈ చాలెంజ్‌ను పూర్తి చేసిన వారికి బహుమతులు లభిస్తాయి.

ఐకియా షాపింగ్ వోచర్‌లతో గెలవండి

చాలెంజ్ పూర్తి చేసిన వారు 100 AED విలువైన ఐకియా షాపింగ్ వోచర్ లేదా క్రెడిట్స్ పొందుతారు. ఈ వోచర్‌ను ఏ ఐకియా స్టోర్‌లోనైనా ఉపయోగించవచ్చు. ఈ వోచర్ బహుమతి చాలెంజ్‌కు మరింత ఉత్సాహాన్ని జోడిస్తుంది.

ఛార్జింగ్ స్టేషన్‌గా కూడా పనిచేస్తుంది

ఈ మినీ బెడ్ కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు. ఇది ఛార్జింగ్ స్టేషన్‌గా కూడా పనిచేస్తుంది. ఫోన్‌ను బెడ్‌పై ఉంచితే.. చాలు అది ఛార్జ్ అవుతుంది.

డిజిటల్ వెల్‌నెస్ ఇనిషియేటివ్

ఈ క్యాంపెయిన్ కేవలం సరదాగా ఉండే ఆలోచన కాదు. ఇది ఒక తెలివైన డిజిటల్ వెల్‌నెస్ ఇనిషియేటివ్. ఐకియా మీరు బాగా నిద్ర పోవడానికి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. డివైస్‌ల నుండి దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

ఎలా కొనుగోలు చేయాలి?

ఈ మినీ బెడ్‌ను నేరుగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఐకియా స్టోర్‌లో కనీసం 750 AED – దుబాయ్ కరెన్సీ (సుమారు 18,000 రూపాయలు) విలువైన కొనుగోలు చేస్తేనే ఈ మినీ బెడ్‌ను పొందవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×