E-Paper
Advertisement

Musical Lollipop: మ్యూజికల్ లాలిపాప్.. నోట్లో పెట్టుకోగానే మ్యూజిక్ వినిపిస్తుంది.. ఇయర్‌బడ్స్ అవసరం లేదు

Musical Lollipop: మ్యూజికల్ లాలిపాప్.. నోట్లో పెట్టుకోగానే మ్యూజిక్ వినిపిస్తుంది.. ఇయర్‌బడ్స్ అవసరం లేదు
Advertisement

Musical Lollipop| CES 2026లో ఇప్పటివరకు చూడని అద్భుతమైన ఆడియో గాడ్జెట్ ఒకటి లాంచ్ అయింది. చూడడానికి ఇది సాధారణ లాలీపాప్‌లా కనిపిస్తుంది. కానీ ఇందులో షాకింగ్ టెక్నాలజీ దాగి ఉంది. దీన్ని నోట్లో పెట్టుకొని కొద్దిగా కొరికితే మీకు సంగీతం వినిపిస్తుంది. ఇయర్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్ లేదా స్పీకర్లు ఏమీ అవసరం లేదు. అయితే మ్యూజిక్ చెవుల ద్వారా కాకుండా, తలలోపల నేరుగా వినిపిస్తుంది.

మ్యూజికల్ లాలీపాప్ ఎలా పని చేస్తుంది?

ఈ గాడ్జెట్ బోన్ కండక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది గాలి ద్వారా కాకుండా ఎముకల ద్వారా సౌండ్ వైబ్రేషన్లను పంపుతుంది. లాలీపాప్ స్టిక్ లోపల.. చిన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ ఉంటుంది. దాని కింద బటన్, వైబ్రేషన్ మెకానిజం ఉంటాయి. యూజర్ తన వెనక దంతాలతో లాలీపాప్‌ను మెల్లగా కొరికితే చాలు.. ఇందులోని వైబ్రేషన్లు.. పంటి, దవడ ఎముక ద్వారా వెళ్తాయి. అక్కడి నుండి అంతర్గత చెవికి చేరుకుంటాయి. ఈ విధంగా సంగీతం స్పష్టంగా వినిపిస్తుంది. చెవిలోని ఇయర్‌డ్రమ్ ద్వారా సౌండ్ వెళ్లదు.

తలలోపల మ్యూజిక్ తో పాటు చుట్టుపక్కల శబ్దాలు కూడా వినవచ్చు

Advertisement

ఈ టెక్నాలజీ వల్ల చెవిలోని ఇయర్‌డ్రమ్ బ్లాక్ కాదు కాబట్టి, చుట్టుపక్కల శబ్దాలు సాధారణంగా వినిపిస్తాయి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లేదా బయట ఉన్నప్పుడు కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. సంగీతం చాలా స్పష్టంగా, మీకు మాత్రమే వినిపిస్తుంది. దగ్గర్లో ఉన్న వారికి ఏ సౌండ్ లీక్ కాదు. కేవలం వినేవారికే మాత్రమే సంగీతం అందుతుంది.

CES 2026లో పని చేసే ప్రోటోటైప్

ప్రస్తుతం ఈ మ్యూజికల్ లాలీపాప్ ప్రయోగంలో చివరి దశ అంటే ప్రోటోటైప్ రూపంలో ఉంది. CES 2026లో దీన్ని ప్రదర్శించారు. ఆడియో టెక్నాలజీ ఎంత వేగంగా మారుతోందో ఈ లాలిపాప్ ద్వారా తెలుస్తోంది. ఇకపై సంగీతం కోసం స్క్రీన్లు, హెడ్‌ఫోన్లు లేదా సాధారణ వేరబుల్ డివైస్‌ల అవసరం లేదు. టెక్నాలజీ ఇప్పుడు శరీర ఇంద్రియాల్లోకి, రోజువారీ వస్తువుల్లోకి ప్రవేశిస్తోంది.

Advertisement

Also Read: గేమింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఖరీదైన గేమ్స్ అన్నీ ఫ్రీ.. అయితే

రుచులు, సంగీత ట్రాక్‌లు

ఈ లాలీపాప్ మూడు వేర్వేరు రుచుల్లో అందుబాటులో ఉంది. ప్రతి రుచికి ఒక ప్రసిద్ధ ఆర్టిస్ట్ పాటను జత చేశారు. పీచ్ ఫ్లేవర్ లాలీపాప్‌లో ఐస్ స్పైస్ పాట వినిపిస్తుంది. బ్లూబెర్రీ ఫ్లేవర్‌లో అకాన్ ట్రాక్ ఉంటుంది. లైమ్ ఫ్లేవర్ లాలీపాప్‌లో అర్మానీ వైట్ పాట వస్తుంది. ఈ విధంగా రుచి, సంగీతం కలిసి ఒక అద్భుతమైన, మల్టీసెన్సరీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×