E-Paper
Advertisement

Whatsapp Unwanted Calls: వాట్సాప్‌లో అనవసర కాల్స్‌తో ఇబ్బందిపడుతున్నారా? ఈ కొత్త ఫీచర్‌ వచ్చేసిందిగా..

Whatsapp Unwanted Calls: వాట్సాప్‌లో అనవసర కాల్స్‌తో ఇబ్బందిపడుతున్నారా? ఈ కొత్త ఫీచర్‌ వచ్చేసిందిగా..
Advertisement

Silence Whatsapp Unwanted Calls| ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ అయిన వాట్పాప్ ని చాలా మంది కాల్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వాట్సాప్ లో అనవసర కాల్స్ వస్తున్నాయని చాలా యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. మీటింగ్ ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చేసే కాల్స్ డిస్టర్బ్ చేస్తాయి. స్పామ్ కాల్స్, ప్రమోషన్ కాల్స్ చాలా ఇబ్బంది పెడతాయి. ఇక అలాంటి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కారంగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫీచర్ ఏంటి?

దీని పేరు సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ (Silence Unknown Callers – అపరిచిత కాల్స్‌ను నిశ్శబ్దం చేయి). మీ ఫోన్‌లో సేవ్ చేయని లేదా అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ఆటోమాటిక్‌గా మ్యూట్ అవుతాయి. ఫోన్ రింగ్ కాదు, వైబ్రేషన్ కూడా రాదు. కానీ కాల్ మిస్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది, కాల్ లాగ్‌లో కనిపిస్తుంది.

ఈ ఫీచర్ ఆన్ చేస్తే ఏం లాభం?

  • మీరు పని చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు అనసర కాల్స్ రాకుండా నివారించ వచ్చు.
  • స్పామ్, ప్రమోషన్ కాల్స్ మీకు ఫోన్‌కు రాకుండా పూర్తిగా అడ్డుకోవచ్చు.
  • ముఖ్యమైన కాల్ అయితే తర్వాత చూసి మీరే కాల్ చేయొచ్చు
  • ఎవర్నీ బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు

ఈ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలి?

Advertisement

వాట్సాప్ తెరిచి కుడివైపు పైన మూలలో మూడు చుక్కలు ఉంటాయి చూడండి. వాటిని నొక్కండి. ఆ తరువాత.. Settings → Privacy → Calls → “Silence Unknown Callers” అనే ఆప్షన్ ఆన్ చేయండి. అంతే! వెంటనే పనిచేయడం మొదలవుతుంది.

ఆన్ చేసిన తర్వాత ఏమవుతుంది?

అపరిచిత నంబర్ల నుంచి కాల్ వచ్చినా ఫోన్ రింగ్ కాదు. కాల్స్ ట్యాబ్‌లో, నోటిఫికేషన్ సెంటర్‌లో మిస్డ్ కాల్‌గా కనిపిస్తుంది. మీకు సమయం ఉన్నప్పుడు చూసి నంబర్ ముఖ్యమైతే తిరిగి కాల్ చేయొచ్చు.

కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

Advertisement

మీరు ఒకసారైనా ఎవరికైనా మెసేజ్ పంపితే లేదా కాల్ చేస్తే, ఆ నంబర్ నుంచి వచ్చే కాల్స్ మళ్లీ సాధారణంగా రింగ్ అవుతాయి. కాబట్టి మీ స్నేహితులు, బంధువుల నుంచి కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ మోగుతుంది. అయితే ముఖ్యమైన కాల్స్ మిస్ కాకుండా కాసేపుకోసారి కాల్ లాగ్ చెక్ చేసుకోండి.

బ్లాక్ చేయడానికి సైలెన్స్ ఫీచర్‌కి ఉన్న తేడా ఏమిటి?

బ్లాక్ చేస్తే ఆ వ్యక్తి మీకు మెసేజ్ కూడా పంపలేడు, కాల్ కూడా చేయలేడు. కానీ “Silence Unknown Callers” ఆన్ చేస్తే కేవలం రింగ్ మాత్రమే ఆగిపోతుంది. మెసేజ్‌లు వస్తాయి, కాల్ లాగ్‌లో కనిపిస్తాయి. మీకు అవసరమైతే అతనికి మీరు తిరిగి మెసేజ్ చేయొచ్చు. కాల్ చేయొచ్చు.

మీ ప్రైవసీ ఇంకా బెటర్ అవుతుంది

ఈ ఫీచర్ వల్ల మీకు అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు ఫోన్ వాటిని నిరోధించి నోటిఫీకేషన్ మాత్రమే ఇస్తుంది. స్పామ్ కాల్స్ ఆటోమాటిక్‌గా ఫిల్టర్ అవుతాయి. రోజువారీ పనులు ఎక్కడా ఆగవు. ఇక నుంచి వాట్సాప్ మరింత ప్రశాంతంగా ఉపయోగించొచ్చు! మీ ప్రైవెసీ మీ చేతుల్లోనే ఉంటుంది.

ఇప్పుడే వాట్సాప్ ఓపెన్ చేసి ఈ ఫీచర్ ఆన్ చేసేయండి.. డిస్టర్బెన్స్ లేకుండా లైఫ్‌ని ఆనందించండి.

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×