E-Paper
Advertisement

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్..మీ ఫోన్‌కు ఏది బెస్ట్?

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్..మీ ఫోన్‌కు ఏది బెస్ట్?
Advertisement

New launch power bank 2026 India: స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, ప్రయాణాల్లో ఉన్నా, పవర్ కట్ అయినా మన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా కాపాడేది పవర్ బ్యాంక్. రోజంతా ఇంటర్నెట్, వీడియోస్ చూస్తుండటంతో బ్యాటరీ ఇట్టే అయిపోతుంది. అందుకే.. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ పవర్ బ్యాంక్ అత్యవసరంగా మారిపోయింది. టెక్నాలజీ.. పెరుగుతున్న కొద్దీ ఈ ఏడాదిలో వచ్చిన పవర్ బ్యాంక్స్‌లో ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి అద్భుతమైన ఫీచర్లు వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 పవర్ బ్యాంక్స్ ఏంటో, వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1.Xiaomi Power Bank 5i (10000mAh):

షావోమి (Xiaomi) బ్రాండ్ నుంచి రీసెంట్‌గా వచ్చిన లేటెస్ట్ మోడల్ ఈ ‘పవర్ బ్యాంక్ 5i’. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా స్లిమ్ అండ్ కాంపాక్ట్ డిజైన్‌తో దీన్ని లాంచ్ చేశారు. ఇందులో బిల్ట్-ఇన్ కేబుల్ ఉండటం దీని ప్రధాన ఆకర్షణ, అంటే మీరు ఎక్కడికి వెళ్లినా విడిగా కేబుల్ మోసుకెళ్లాల్సిన పనిలేదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ ప్రయాణాలు చేసే వారికి బాగా సెట్ అవుతుంది.

Advertisement

ధర: రూ.3,299

2. Ambrane Stellar 20K (20000mAh):

మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారా? మీ ఫోన్ రెండు మూడు సార్లు ఫుల్ ఛార్జ్ అవ్వాలా? అయితే ఆంబ్రేన్ స్టెల్లార్ 20K మీకు పర్ఫెక్ట్ ఆప్షన్. ఏకంగా 20000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో పాటు 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది సెమీ సాలిడ్ బ్యాటరీ టెక్నాలజీతో, ఇన్‌బిల్ట్ కేబుల్‌తో వస్తుంది. ఇండియాలో తయారైన బ్రాండ్ కాబట్టి నమ్మకంగా తీసుకోవచ్చు.

Advertisement

ధర: రూ.2,199.

3. boAt EnergyShroom PB330 Magnacharge:

బోట్ (boAt) అంటేనే స్టైలిష్ డిజైన్ , యూత్ ఫేవరెట్.ఈ ఎనర్జీశ్రూమ్ PB330 మ్యాగ్నఛార్జ్ మోడల్ కేవలం వైర్డ్ ఛార్జింగ్ మాత్రమే కాదు, 15W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ వాడే వారికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. 10000mAh బ్యాటరీతో, క్యూట్ అండ్ కాంపాక్ట్ డిజైన్‌తో చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది.

ధర: రూ. 2,999.

Also Read: ఇక ఇంటినే థియేటర్ లా మార్చేయండి..రూ.15వేలలోపు బెస్ట్ వన్‌ప్లస్ టీవీ!

4. Portronics Ignis 65W Power Bank:

మీరు కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు, అర్జంట్‌గా మీ ల్యాప్‌టాప్ కూడా ఛార్జ్ చేసుకోవాలా? అయితే పోర్ట్రానిక్స్ ఇగ్నిస్ 65W మోడల్ మీకోసమే. ఇది ఏకంగా 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్-సీ పవర్ డెలివరీ (PD) సపోర్ట్‌తో స్టూడెంట్స్, ఆఫీస్ వర్క్ చేసుకునే వారికి ఇది అద్భుతమైన మల్టీ-పర్పస్ గ్యాడ్జెట్.

ధర: రూ.2,000 .

5. Anker PowerCore Slim 10000 PD:

ప్రపంచవ్యాప్తంగా పవర్ బ్యాంక్స్ తయారీలో యాంకర్ ది బెస్ట్ బ్రాండ్. ఈ ఏడాదిలో ట్రెండింగ్ లో ఉన్న పవర్‌కోర్ స్లిమ్ మోడల్ కేవలం 13mm మందంతో, చాలా సన్నగా ఉంటుంది. 20W టైప్-సీ పవర్ డెలివరీతో ఇది మీ ఫోన్‌ను సురక్షితంగా, స్పీడ్‌గా ఛార్జ్ చేస్తుంది. దీనిలోని PowerIQ టెక్నాలజీ వల్ల మీ డివైజ్‌కి ఎంత ఛార్జింగ్ అవసరమో అంతే సప్లై అవుతుంది.

ధర: రూ. 2,499.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×