E-Paper
Advertisement

Amazfit Active Max smartwatch: నెలకు ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. అదిరిపోయే ఫీచర్లతో అమాజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్

Amazfit Active Max smartwatch: నెలకు ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. అదిరిపోయే ఫీచర్లతో అమాజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్
Advertisement

Amazfit Active Max smartwatch: స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో పేరు సంపాదించిన అమాజ్‌ఫిట్ (Amazfit) తాజాగా పరిచయం చేసిన కొత్త స్మార్ట్‌వాచ్ యాక్టివ్ మ్యాక్స్. ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే చాలా బ్రైట్‌గా కనిపించే అమోలెడ్ డిస్‌ప్లే, దాదాపు నెల రోజుల బ్యాటరీ లైఫ్, తగినంత ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు. రోజువారీ వాడకానికి సరిపడే స్టైల్‌తో పాటు స్పోర్ట్స్ లవర్స్‌ని ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ అమాజ్‌ఫిట్ యాక్టివ్ మ్యాక్స్ పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా చూద్దాం.

1.5 ఇంచుల సర్క్యులర్ అమోలెడ్ డిస్‌ప్లే

Advertisement

అమాజ్‌ఫిట్ యాక్టివ్ మ్యాక్స్‌లో 1.5 ఇంచుల సర్క్యులర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఈ స్క్రీన్ గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. బయట ఎండలో ఉన్నా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఆటో బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్ సపోర్ట్ ఉంది. జాగింగ్ చేస్తున్నప్పుడు గానీ, అవుట్‌డోర్ వర్కౌట్ సమయంలో గానీ డిస్‌ప్లే రీడబిలిటీపై ఎలాంటి ఇబ్బంది ఉండదు. కలర్ అవుట్‌పుట్ కూడా వైవిడ్‌గా ఉండటంతో వాచ్ ఫేస్‌లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

బిల్డ్ క్వాలిటీ డిజైన్

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ బరువు సుమారు 39.5 గ్రాములు మాత్రమే, అది కూడా స్ట్రాప్ లేకుండా. చేతికి చాలా లైట్‌గా అనిపించేలా డిజైన్ చేశారు. బాడీకి అల్యూమినియం, పాలిమర్ మెటీరియల్స్ ఉపయోగించారు. 5 ఏటిఎం వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటంతో 50 మీటర్ల లోతు వరకు నీటి ఒత్తిడిని తట్టుకోగలదు. వర్షంలో నడిచినా, స్విమ్మింగ్ చేసినా వాచ్‌కు ఇబ్బంది ఉండదు.

ఒకసారి చార్జ్ చేస్తే 25 రోజులు

యాక్టివ్ మ్యాక్స్‌లో పెద్ద హైలైట్ బ్యాటరీ లైఫ్. సాధారణ వాడకంలో ఒకసారి చార్జ్ చేస్తే 25 రోజుల వరకు బ్యాటరీ ఉంటుందని అమాజ్‌ఫిట్ చెబుతోంది. జీపీఎస్ ట్రాకింగ్ ఆన్ చేస్తే సుమారు 64 గంటల వరకు వాడుకోవచ్చు. రోజూ చార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా దీర్ఘకాలం వాడుకునేలా ఈ వాచ్ డిజైన్ చేశారు.

Also Read: Foldable Smartphones: శామ్‌సంగ్, గూగుల్ మధ్య వార్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫోల్డబుల్ ఫోన్లు

జీపీఎస్, మ్యాప్స్ సపోర్ట్

ఈ స్మార్ట్‌వాచ్‌లో టోపోగ్రాఫిక్ మ్యాప్స్, స్కీ మ్యాప్స్ వంటి అడ్వాన్స్‌డ్ మ్యాపింగ్ ఫీచర్లు ఉన్నాయి. రన్నింగ్ చేసే వాళ్లకు రూట్ ట్రాకింగ్ చాలా ఉపయోగపడుతుంది. రన్స్ సమయంలో ఆటోమేటిక్ పాజ్ ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా మీరు పరుగెత్తే మార్గాలను బేసిక్ రూట్‌లుగా క్రియేట్ చేసే సౌకర్యం కూడా ఇందులో ఉంది.

కాల్ ఫీచర్లు, స్టోరేజ్

యాక్టివ్ మ్యాక్స్‌లో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉన్నాయి. దీనివల్ల బ్లూటూత్ కాలింగ్ చేయొచ్చు. ఫోన్ జేబులో లేకపోయినా వాచ్ నుంచే కాల్స్ అటెండ్ చేయవచ్చు. ఇందులో 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. మీకు ఇష్టమైన మ్యూజిక్, పోడ్కాస్ట్‌లను వాచ్‌లోనే స్టోర్ చేసుకుని వినే అవకాశం ఉంది.

ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్పోర్ట్స్ మోడ్‌లు

ఈ స్మార్ట్‌వాచ్ 160కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. రన్నింగ్, జిమ్ వర్కౌట్స్, సైక్లింగ్, యోగా లాంటి ఎన్నో యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయవచ్చు. రోజువారీ ఫిట్‌నెస్ డేటాను క్లియర్‌గా చూపిస్తుంది. స్ట్రావా, అడిడాస్ రన్నింగ్ లాంటి యాప్‌లకు సపోర్ట్ ఉంది. అలాగే అమాజ్‌ఫిట్‌కి చెందిన జెప్ యాప్ ద్వారా డేటాను మరింత డీటెయిల్‌గా చూసుకునే అవకాశం ఉంటుంది.

ఇండియాలో ధర ఎంతంటే?

అమాజ్‌ఫిట్ యాక్టివ్ మ్యాక్స్ ప్రస్తుతం యూరప్ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సపోర్ట్‌తో పాటు ఈ వాచ్ ధర 169.90 యూరోలు. అంటే ఇండియాల ధరతో పోలిస్తే రూ.14,999గా ఉంటుందని సమాచారం. ఈ ధరకు ఇంత పెద్ద డిస్‌ప్లే, నెల రోజుల బ్యాటరీ లైఫ్, తగినంత ఫిట్‌నెస్ ఫీచర్లు ఉండటం వలన యాక్టివ్ మ్యాక్స్ మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌వాచ్‌గా కనిపిస్తోంది. అమాజ్‌ఫిట్ యాక్టివ్ మ్యాక్స్ రోజువారీ వాడకానికి, ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవాళ్లకు సరిపోయే స్మార్ట్‌వాచ్. బ్రైట్ అమోలెడ్ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, అడ్వాన్స్‌డ్ జీపీఎస్ ఫీచర్లు ఈ వాచ్‌ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. నెల రోజుల బ్యాటరీ కావాలనుకునే వాళ్లు ఈ మోడల్‌ని తప్పకుండా గమనించాల్సిందే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×