E-Paper
Advertisement

Prabhas New Movie : ఫిబ్రవరిలో సెట్స్‌‌పైకి మరో సినిమా.. డార్లింగ్‌కు అసలు గ్యాప్ లేదు

Prabhas New Movie : ఫిబ్రవరిలో సెట్స్‌‌పైకి మరో సినిమా.. డార్లింగ్‌కు అసలు గ్యాప్ లేదు
Advertisement

Prabhas Upcoming Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు.. ఈ కొత్త సంవత్సరం.. ఒక శుభవార్త వినిపించబోతోంది. గతేడాది విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన Kalki 2898 AD రెండో భాగం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఫిబ్రవరి నెలలో కల్కి పార్ట్–2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.

కల్కి మొదటి భాగం విడుదలై భారీ వసూళ్లు సాధించడంతో పాటు..ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా తన స్థాయిని మరోసారి నిరూపించారు. మహానటి లాంటి అవార్డు సినిమా తెరకెక్కిచ్చిన దర్శకుడు నాగ అశ్విన్.. రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం కథ, విజువల్స్, పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వద్ద కథను ఆపిన తీరు వల్ల.. రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే పార్ట్–2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ ముందుగా చేస్తున్న సినిమా ఏదంటే..

Advertisement

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ముందుగా ఆయన నటిస్తున్న చిత్రం సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో రానున్న స్పిరిట్. ఈ సినిమాకు ప్రభాస్ ఇప్పటికే 50 నుంచి 60 రోజుల కాల్‌షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల కొన్ని రోజులు రెగ్యులర్ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ సినిమా నుంచి రేపు ఒక చిన్న అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఫేస్ రివీల్ ఉండదని..కేవలం పోలీస్ యూనిఫార్మ్‌లో ఉన్న ప్రభాస్ ఛెస్ట్..నేమ్ ప్లేట్ మాత్రమే చూపిస్తారని తెలుస్తోంది.

రెండు సినిమాలు ఒకేసారి..

స్పిరిట్ షూటింగ్‌తో పాటు, కల్కి 2 పనులను సమాంతరంగా ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరిలో కల్కి పార్ట్–2 సెట్స్‌పైకి వెళ్లేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. మొదటి భాగం ముగిసిన విధానం చూస్తే, రెండో భాగంలో ప్రభాస్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుందని అంచనా. భారీ యాక్షన్ సన్నివేశాలు, కీలక మలుపులు ఈ భాగంలో ఉంటాయని సమాచారం.

Advertisement

మొత్తానికి జనవరిలో ఇతర సినిమా అప్డేట్లు.. ఫిబ్రవరిలో కల్కి 2 షూటింగ్ ప్రారంభం కావడం ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్‌లా మారింది. ఈ రెండో భాగం కూడా మొదటి భాగం స్థాయిని మించి విజయాన్ని సాధిస్తుందేమో అన్న ఆశలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి.

ALSO READ: Prabhas Fans : ప్రేమతో ప్రభాస్ ఫ్యాన్స్ బిర్యానీ పంపిస్తే… మారుతి తినకుండా ఇలా చేశాడా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×