E-Paper
Advertisement

New AI Law plan: కేంద్రం కొత్త ప్లాన్, AI దుర్వినియోగానికి చెక్, తెరపైకి కొత్త చట్టం

New AI Law plan: కేంద్రం కొత్త ప్లాన్, AI దుర్వినియోగానికి చెక్, తెరపైకి కొత్త చట్టం
Advertisement

New AI Law plan: దేశంలో AI దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రప్రభుత్వం. ​ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. ఇప్పుడున్న ఐటీ చట్టాల్లో మార్పులు చేయడం కాకుండా AI సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త లీగల్ ఫ్రేమ్‌వర్క్ రెడీ చేస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య వంటి రంగాల్లో మోసాలను అడ్డుకోవడమే
ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.

ఏఐ కోసం కొత్త చట్టం-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొత్సహించడమే కాదు, అందుకు తగినట్టుగా కొత్త చట్టాలను రూపొందించే పనిలో పడింది కేంద్రం. ఏఐ వినియోగంలో తీరును బట్టి నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. అయితే రిస్కును బట్టి వాటిని వర్గీకరణలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తక్కువ రిస్కు ఉంటే చిన్నపాటి నిబంధనలు, ఎక్కువ రిస్కు ఉంటే కఠిన నిబంధనలను కొత్త చట్టంలో చేర్చనుందట.

Advertisement

కేంద్రం కొత్త ప్లాన్, AI దుర్వినియోగానికి చెక్-రిస్క్ ఎక్కువగా ఉండే బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య, క్రిటికల్‌ వంటి రంగాల్లో కఠిన నియమాలను పొందుపరిచనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చే అధికారం కొత్త చట్టం ద్వారా కేంద్రానికి దక్కనుంది. ఏఐ వ్యవస్థలతో అంతగా రిస్కు ఉండదని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకునేందుకు ఏఐ వినియోగంతో ఇబ్బంది ఉండదు. అలాంటి చోట్ల ఏఐ వినియోగంపై ఆంక్షలు ఉండవని సమాచారం.

ఫైనాన్స్-ఆరోగ్యం, నిర్మాణ రంగంపైనే-బ్యాంకు రుణం మంజూరు, రోగులకు వ్యాధులు నిర్ధారించే అంశాల్లో ఏఐ వల్ల చిన్న పొరపాటు జరిగినా దాని నష్టం భారీగా ఉంటుంది. అదే నిర్మాణ రంగంలో పొరపాటు జరిగితే భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురుకావచ్చు. అలాంటి రంగాల్లో కఠిన నిబంధనలను అమలు చేసే అవకాశం ఉంది. చాట్‌బాట్‌లు, టూల్స్, సిఫార్సు వ్యవస్థలు తక్కువ రిస్క్ ఉన్న కేటగిరీలో అవకాశముంది.

Advertisement

ALSO READ: బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? అయితే.. ఫాస్ట్‌ట్రాక్ FS1 పై ఓ లుక్కేయండి!

గతంలో ఏఐ చట్టం తేవాలని భావించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చట్టం ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది కేంద్రం. గతేడాది కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ నిబంధనలే సరిపోతాయని ఐటీ శాఖ భావించింది. మారిన పరిస్థితుల్లో చట్టం ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది కేంద్రం. ఇప్పుడున్న నిబంధనలు కొత్త ఏఐ రాక ముందు తయారు చేసినవి.

అందుకే కొత్త చట్టం అవసరమనేది ప్రభుత్వ భావన. ఏఐ వ్యవస్థ వల్ల ఆ రంగానికి ప్రమాదముందని తెలిస్తే వాటిని వాటిని నిలిపివేసే అధికారం కొత్త చట్టం ద్వారా కేంద్రానికి దక్కనుంది. అత్యవసర పరిస్థితుల్లో దాని సాంకేతిక వివరాలు బయటపెట్టాలని సదరు సంస్థను కోరే అవకాశం ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×