E-Paper
Advertisement

Netflix: ఆండ్రాయిడ్ యూజర్లకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక ఆ ఆప్షన్ లేనట్లే!

Netflix: ఆండ్రాయిడ్ యూజర్లకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక ఆ ఆప్షన్ లేనట్లే!
Advertisement

Netflix Android| ఓటిటి దిగ్గజ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. ఆండ్రాయిడ్ యాప్ నుంచి గూగుల్ కాస్ట్ ఆప్షన్‌ని నిశ్శబ్దంగా తొలగించేసింది. ఈ ఫీచర్‌తో ఇప్పటివరకు ఫోన్‌లోని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ని టీవీలో సులభంగా చూసేందుకు వీలుండేది. అయితే ఇటీవల చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు యాప్‌లో కాస్టింగ్ ఐకాన్ లేకపోవడం గమనించారు. ఈ మార్పునకు సరైన కారణం గురించి నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ బిజినెస్, టెక్నికల్ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గూగుల్ కాస్ట్ అంటే ఏంటి?

గూగుల్ కాస్ట్ సాయంతో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోని సినిమాలు, సిరీస్ కంటెంట్‌ని స్మార్ట్ టీవీ లేదా క్రోమ్‌కాస్ట్‌పై పెద్ద స్క్రీన్‌లో చూడవచ్చు. టీవీలో వేరుగా నెట్‌ఫ్లిక్స్ యాప్ అవసరం లేకుండానే పని చేసేది. చాలా సంవత్సరాలుగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది.

గూగుల్ కాస్ట్ వినియోగం తక్కువ

Advertisement

రిపోర్ట్స్ ప్రకారం.. ఆండ్రాయిడ్ యూజర్లలో సుమారు 10 శాతం మంది మాత్రమే రెగ్యులర్‌గా గూగుల్ కాస్ట్ ఉపయోగించేవారు. తక్కువ సంఖ్య కారణంగానే నెట్‌ఫ్లిక్స్ ఈ ఫీచర్‌ని తీసేయాలని నిర్ణయించింది. తక్కువ స్థాయిలో వినియోగించబడే ఫీచర్లను నిర్వహించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే ఎక్కువ మంది ఉపయోగించే ఫీచర్లపై దృష్టి పెట్టాలని బిజినెస్ ద‌‌ృష్ట్యా నెట్‌ఫ్లిక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నేటివ్ టీవీ యాప్‌లను ఉపయోగించాలని నెట్‌ఫ్లిక్స్ సూచన

ఇప్పుడు యూజర్లను స్మార్ట్ టీవీల్లో లేదా స్ట్రీమింగ్ డివైస్‌ల్లో ఉన్న యాప్‌తోనే చూడమని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది. ఈ యాప్‌లు బాగా పని చేస్తాయి, రిమోట్‌తో సులభంగా నియంత్రించవచ్చు. మొబైల్ నుంచి కాస్ట్ చేయడం కంటే ఇది చాలా మెరుగైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నెట్‌ఫ్లిక్స్ సూచిన.

పాత క్రోమ్‌కాస్ట్ డివైస్‌లకు ప్రమాదం

Advertisement

పాత క్రోమ్‌కాస్ట్ మోడల్స్ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేకపోతే వాటికి సపోర్ట్ తీసేయవచ్చు. పాత డివైస్‌లకు సపోర్ట్ నిలిపివేయడం సాధారణంగా సెక్యూరిటీ కారణాల వల్లే జరుగుతుంది.

Also Read: ప్రాణాపాయ స్థితిలో ఒక్క క్లిక్‌తో సాయం మీ చెంతకు.. స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ గురించి తెలుసా?

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కూడా కారణం

కాస్టింగ్‌తో మొబైల్ ప్లాన్ యూజర్లు పెద్ద స్క్రీన్‌పై చూడగలిగేవారు. ఇది టీవీ కోసం ఎక్కువ ధర చెల్లించే ప్లాన్‌ల అవసరాన్ని తగ్గిస్తుంది. కాస్టింగ్ తీసేయడం వల్ల యూజర్లు ఎక్కువ ధర ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. ఇది నెట్‌ఫ్లిక్స్ ఆదాయానికి మేలు చేస్తుంది.

యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లో నిషేధం

యాడ్-సపోర్టెడ్ ప్లాన్ యూజర్లకు గూగుల్ కాస్ట్ ఎప్పుడో లేదు. ఇప్పుడు సాధారణ యూజర్లకు కూడా ఈ నియమం వర్తిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వ్యాపార లాభాలు, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం కోసం గూగుల్ కాస్ట్ తొలగించింది. చాలా మంది ఇప్పటికే స్మార్ట్ టీవీ యాప్‌లనే ఉపయోగిస్తున్నారు. ఈ నిర్ణయం మారే అవకాశం తక్కువగా ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×