E-Paper
Advertisement

నాసా తెచ్చిన వింత కాఫీ కప్పు.. బోర్లించినా, తలకిందులు చేసినా.. చుక్క కూడా వేస్ట్ కాదు!

నాసా తెచ్చిన వింత కాఫీ కప్పు.. బోర్లించినా, తలకిందులు చేసినా.. చుక్క కూడా వేస్ట్ కాదు!
Advertisement

NASA Coffee Cup: ఈ రోజుల్లో కాఫీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కాఫీ లవర్స్ దానిని పానియంలా కాకుండా ఓ ఏమోషన్ లా చూస్తుంటారు. రోజులో కనీసం 2-3 సార్లైనా కాఫీ చుక్క తగలాల్సిందే అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తుంటారు. అలాంటి వారు అంతరిక్షంలోకి వెళ్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ కాఫీ తాగడం ఎంతో కష్టం. ఒకవేళ ప్రయత్నించినా.. కాఫీ చుక్కలు గాల్లో తేలిపోతుంటాయి. కాబట్టి ఈ సమస్యకు చెక్ పెడుతూ నాసా ఒక వినూత్నమైన కాఫీ కప్పును తయారు చేసింది. దీని వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

అంతరిక్షంలో కాఫీ కష్టాలు

సాధారణంగా భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల ద్రవ పదార్థాలు.. గ్లాసు లేదా కప్పు అడుగు భాగంలో స్థిరంగా ఉంటాయి. కానీ అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ వాతావరణంలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అక్కడ ద్రవాలు ఒకచోట స్థిరంగా ఉండవు. కప్పులో పోస్తే అవి ఉపరితలాలకు అంటుకుపోవడం, గాల్లో చిన్న చిన్న బుడగల్లా తేలిపోవడం జరుగుతుంది. అందుకే దశాబ్దాలుగా వ్యోమగాములు కాఫీ లేదా ఇతర పానీయాలను సీల్ చేసిన ప్లాస్టిక్ పౌచ్‌లు, స్ట్రాల సహాయంతో తాగాల్సి వచ్చేది.

రంగంలోకి నాసా శాస్త్రవేత్తలు

Advertisement

కాఫీ సమస్యకు ముగింపు పలకాలని 2000వ సంవత్సరం ప్రారంభంలో నాసా శాస్త్రవేత్త మార్క్ వీస్లోగెల్ నేతృత్వంలోని బృందం ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్ట్రాలు, పంపులు ఏవీ లేకుండా సాధారణ కప్పులాగే తెరిచి ఉంచి తాగేలా ఒక కప్పును డిజైన్ చేయాలనుకుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోయినా, ద్రవాలకున్న ‘ఉపరితల తన్యత’ (Surface Tension), ‘కేశనాళికీయత’ (Capillary Action) అనే సహజ గుణాలను వాడుకుని సరికొత్త డిజైన్‌ను రూపొందించారు. దీనికి ‘క్యాపిలరీ బెవరేజ్ కప్’ (Capillary Beverage Cup) అని పేరు సైతం పెట్టారు.

విజయవంతమైన ప్రయోగం

నాసా కనుగొన్న ఈ కప్పు సాధారణ కప్పుల్లా గుండ్రంగా ఉండదు. దీనిని ఒక ప్రత్యేకమైన ‘కన్నీటి చుక్క’ (Teardrop) ఆకారంలో.. ఒకవైపు చాలా ఇరుకైన మలుపు ఉండేలా డిజైన్ చేశారు. ఈ ఇరుకైన భాగం ద్రవాన్ని కింది నుంచి పైకి.. అంటే వ్యోమగామి తాగే కప్పు అంచు వైపునకు సహజంగానే నెడుతుంది. దీనివల్ల స్ట్రాలు లేకపోయినా అంతరిక్షంలో కాఫీని సాధారణ కప్పుతో తాగిన అనుభూతి కలుగుతుంది. ఈ వినూత్న కప్పును 2015లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో విజయవంతంగా పరీక్షించారు.

Advertisement

Also Read: రూ.16,350 కోట్ల పెట్టుబడి.. రెండేళ్లలో ఉత్పత్తి.. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు గ్యారంటీ!

భవిష్యత్తు మిషన్లకు వరం!

ఈ కప్పు అంతరిక్షంలో వ్యోమగాములకు కాఫీ రుచిని ఆస్వాదించడానికి మాత్రమే పరిమితం కాదని నాసా పరిశోధకలు చెబుతున్నారు. దీని వెనుక ఉన్న ‘క్యాపిలరీ ఫ్లో’ (ద్రవాల ప్రవాహ) సాంకేతికత అంతరిక్ష పరిశోధనల్లో చాలా కీలకం కానుందని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడి (Mars) పైకి చేపట్టబోయే మానవ సహిత యాత్రల్లో ఇది ఎంతో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. అలాగే స్పేస్‌క్రాఫ్ట్ ఇంధన నిల్వ వ్యవస్థలను మెరుగుపరచడానికి, నీటి పునరుత్పత్తి సాంకేతికతకు, వ్యోమగాముల ప్రాణరక్షణ వ్యవస్థల డిజైనింగ్‌కు ఈ పరిశోధన దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read: టీవీ, ఏసీలపై ఆఫర్ల వర్షం.. 40% డిస్కౌంట్‌, రూ.10 వేల క్యాష్ బ్యాక్.. సామాన్యులకు పండగే!

Related News

Google Pixel 10పై భారీ ధర తగ్గింపు.. ఆఫర్ ధరెంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

బోట్ 120W సౌండ్‌బార్‌పై.. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో క్రేజీ డిస్కౌంట్!

రూ.15వేల లోపు ది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!

రెడ్‌మి, షియోమి ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏ మోడల్ ధర ఎంత తగ్గిందంటే?

బోట్ నుంచి కొత్త అల్టిమా ప్రైమ్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు మైండ్ బ్లాక్

రూ.1,299 కే టైప్-సి ఛార్జింగ్, ఫంక్షనల్ క్రౌన్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్స్ అదిరాయిగా!

రూ. 2000లోపు.. బెస్ట్ ఇయర్‌బడ్స్ కావాలా ? ఈ ఆఫర్లు మిస్సవ్వొద్దు

ఈ-సిమ్‌తో ఇంటర్నెట్ స్పీడు పెరుగుతుందా? బెస్ట్ నెట్ వర్క్‌కు ఏ సిమ్ బెస్ట్?

Big Stories

Advertisement
×