E-Paper
Advertisement

Google Pixel 10పై భారీ ధర తగ్గింపు.. ఆఫర్ ధరెంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Google Pixel 10పై భారీ ధర తగ్గింపు.. ఆఫర్ ధరెంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Advertisement

Google Pixel 10 Price Cut: ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. గూగుల్ తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10’పై భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ధర ఎంత తగ్గింది?

గూగుల్ పిక్సెల్ 10 (12GB RAM, 256GB స్టోరేజ్) వేరియంట్ రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కానీ ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.14,299 నేరుగా తగ్గి, కేవలం రూ.65,700కే లభిస్తోంది. దీనికి తోడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.41,050 వరకు అదనపు తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: అసలేం జరుగుతోంది? వారం తిరక్కుండానే Metaకు కేంద్రం రెండోసారి గట్టి వార్నింగ్!

స్క్రీన్ క్వాలిటీ అదుర్స్:

ఈ ఫోన్ 6.3 ఇంచుల ఓఎల్ఈడీ సూపర్ యాక్చువా డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను ఉపయోగించారు.

ఏఐ ఫీచర్లు అద్భుతం:

Advertisement

ఇందులో గూగుల్ సొంత టెన్సర్ G5 ప్రాసెసర్‌తో పాటు భద్రత కోసం టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను అందించారు. ఈ ఫోన్ గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. సరికొత్త మెటీరియల్ యూ ఇంటర్‌ఫేస్‌తో యూజర్లకు సరికొత్త, సురక్షితమైన సాఫ్ట్‌వేర్ అనుభూతిని ఇస్తుంది.

5x ఆప్టికల్ జూమ్‌:

ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. దీనిలో 48MP మెయిన్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో లెన్స్, 13MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 4970mAh బ్యాటరీ ఇందులో ఉంది.

Also Read: Lava Agni 4, Bold సిరీస్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. Amazon Saleలో బెస్ట్ బడ్జెట్ డీల్స్ ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×