// // NASA Records Black hole Sound| అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి -->
E-Paper
Advertisement

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి

NASA Records Black hole Sound: అంతరిక్షంలో అలజడి.. భయానక శబ్దాలను రికార్డ్ చేసిన నాసా.. ఇదిగో ఇక్కడ వినండి
Advertisement

NASA Records Black hole Sound| అంతరిక్షంలో 25 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక పెద్ద కృష్ణబిలం (బ్లాక్ హోల్) నుంచి వస్తున్న భయానక శబ్దాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రికార్డ్ చేసింది. ఆ కృష్ణబిలం నుంచి వచ్చే భయానక ధ్వని తరంగాలు ఒక గుండ్రాకారంలో వ్యాపిస్తున్న సమయంలో నాసా వాటిని రికార్డ్ చేసి వాటిని యాంటి క్లాక్ వైజ్ లో ప్లే చేసింది.

అంతరిక్షంలో పర్సియస్ గెలాక్సీ క్లస్టర్‌లో సరిగ్గా మధ్యలో ఈ కృష్ణబిలం ఉంది. ఆ కృష్ణబిలం నుంచి చాలా డిస్టర్బింగ్, రాక్షస హుంకార శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ శబ్దాలను గమినించిన నాసా వ్యోమగాములు రికార్డ్ చేశారు. ఈ ఆడియో రికార్డింగ్ 2022 సంవత్సరంలో నాసా విడుదల చేసింది. అయితే బ్లాక్ హోల్ నుంచి విడుదలయ్యే సౌండ్ ని 57, 57 ఆక్టవేవ్స్ పెంచి మానవ చెవులు వినగలిగే స్థాయికి సౌండ్ లెవెల్స్ పెంచింది.

Advertisement

సాధారణంగా అంతరిక్షంలో మానవులు ఎటువంటి శబ్దాలు వినలేదరు. ఎందుకంటే అంతరిక్షంలో ఎటువంటి ధ్వని తరంగాలు ఉండవుగనుక. కానీ 2003లో అంతరిక్ష పరిశోధకులు ఆశ్చర్యకర విషయాన్ని కనుగొన్నారు. పర్సియస్ గెలాక్సీ లో ఉన్న కృష్ణబిలం చుట్టూ గ్యాస్ ఉందని అక్కడ ధ్వని తరంగాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ధ్వని తరంగాల నుంచి వచ్చే శబ్దాలు మానవ వినికిడి శక్తి కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అప్పటి నుంచి ఈ పర్సియస్ గెలాక్సీ కృష్ణబిలం శబ్దాలపై పరిశోధనను వేగవంతం చేశారు. దీంతో ఈ కృష్ణబిలం శబ్దాలకు ఫేమస్ అయింది.

Also Read: లెబనాన్ లో పేజర్ పేలుళ్లు.. మొబైల్ ఫోన్ కూడా పేలిపోతాయా?..

Advertisement

ఈ పరిశోధనల్లో వెలుగుచూసిన విషయాలను నాసా వెల్లడించింది. ఈ కృష్ణబిలం నుంచి వచ్చే శబ్దాలు మానవ చెవికి చేరాలంటే కోటి సంవత్సరాలు పడుతుందని తెలిపింది. అది కూడా ఒక సెకనులో కూడా చాలా తక్కువ భాగం సమయానికి మాత్రమే ఇది వినబడే అవకాశముంది. అంతరిక్షంలో ధ్వని తరంగాలను కనుగొనడానికి ఇంట్రాక్లస్టర్ మీడియం నాసా చంద్రా ఎక్స్ రే అబ్‌జర్వేటరీ అనే టెలిస్కొప్ ని ఉపయోగించింది. ఆ తరువాత ఆ ధ్వని తరంగాలను సోనిఫికేషన్ చేసి రికార్డ్ చేసింది.

అంతరిక్షంలో సాధారంణంగా గెలాక్సీ క్లస్టర్లు, ఇంట్రాక్లస్టర్ మీడియం, మీదుగా కొన్ని గ్యాసులు, ప్లాస్మా ఏర్పడి ఉంది. దీని వల్ల అంతరిక్షంలో వేడి పెరుగుతోంది. అయితే ఈ గ్యాసుల మీదుగా ధ్వని తరంగాలు ప్రయాణిస్తుండడాన్ని పరిశోధకులు కనుగొన్నారు. దీని వల్ల అంతరిక్షంలోని ప్లాస్మాలో వేడి పెరిగడం, ఎనర్జీ విభజన జరిగే ప్రక్రియం కొనసాగుతోంది. ఫలితంగా అంతరిక్షంల నక్షత్రాలు తమ స్థానాన్ని మార్చుకుంటున్నాయి. దీనివల్ల గెలాక్సీ క్లస్టర్లు అభివృద్ధి చెందుతున్నాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×