E-Paper
Advertisement

Smartphone in Space: అంతరిక్షంలో ఇన్‌స్టాగ్రామ్.. చంద్రుడిపై స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న నాసా

Smartphone in Space: అంతరిక్షంలో ఇన్‌స్టాగ్రామ్.. చంద్రుడిపై స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న నాసా
Advertisement

Space Smartphone| అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చంద్రుడికి వెళ్లే ఆస్ట్రోనాట్లు (వ్యొమగాములు) ఇప్పుడు ఆధునిక స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లవచ్చు. ఐఫోన్ వంటి పాపులర్ ఫోన్లు కూడా అనుమతించారు. NASA అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐసాక్‌మాన్ ఈ విషయాన్ని Xలో షేర్ చేశారు. Crew-12 (సిబ్బంది), Artemis II మిషన్లలో ఆస్ట్రోనాట్లు ఫోన్లు తీసుకెళ్లవచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇది స్పేస్ ట్రావెల్ రూల్స్‌లో చారిత్రక మార్పు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

NASA ప్రకారం.. స్మార్ట్‌ఫోన్లు ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో ఉన్నప్పుడు వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ముఖ్యమైన మూమెంట్స్ సులభంగా రికార్డ్ చేయవచ్చు. కుటుంబ సభ్యులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వవచ్చు. ఫోటోలు, వీడియోలు పబ్లిక్‌తో షేర్ చేయవచ్చు. కమ్యూనికేషన్ వేగంగా, సులభంగా జరుగుతుంది. సాంకేతిక ఎక్విప్‌మెంట్ కంటే సహజంగా మెమరీలు క్యాప్చర్ చేయవచ్చు. ఆస్ట్రోనాట్లు మిషన్ సమయంలో సౌకర్యంగా ఉండాలని NASA కోరుకుంటోంది. రియల్ అనుభవాలు షేర్ చేయడం వల్ల స్పేస్ ట్రావెల్ గురించి ప్రజలు మరింత బాగా అర్థం చేసుకుంటారు.

స్మార్ట్ ఫోన్లకు అంతరిక్షంలో అనుమతిలేదు

Advertisement

ఇంతకు ముందు ఆస్ట్రోనాట్లు పర్సనల్ స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లలేరు. కేవలం అనుమతించిన స్పేస్ ఎక్విప్‌మెంట్ మాత్రమే ఉపయోగించేవారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ల్యాప్‌టాప్‌లు అనుమతించారు. ఈమెయిల్స్, వీడియో కాల్స్, మెసేజ్‌లు పంపడానికి ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేవారు. కానీ ఇది చాలా కాంప్లెక్స్‌గా, పరిమితంగా ఉండేది. ఫోటోలు, వీడియోలు సహజంగా తీయలేరు. అన్నీ కంట్రోల్ చేసిన పద్ధతిలోనే జరిగేవి.

ఎందుకు స్మార్ట్‌ఫోన్లు అనుమతించలేదు?

స్మార్ట్‌ఫోన్ల వల్ల చాలా సేఫ్టీ రిస్క్‌లు ఉన్నాయని ఇంజినీర్లు భావించారు. స్పేస్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌తో ఇంటర్ఫియరెన్స్ అవుతుందేమోనని భయపడ్డారు. డివైస్ మన్నిక, రేడియేషన్ సమస్యలు కూడా ఉన్నాయి. నెట్‌వర్క్ కనెక్షన్స్‌పై స్ట్రిక్ట్ కంట్రోల్ కావాలని NASA భావించింది. బ్యాటరీ సేఫ్టీ, టచ్‌స్క్రీన్ పనిచేయకపోవడం వంటి రిస్క్‌లు ఉన్నాయి. అందుకే స్మార్ట్‌ఫోన్లను అనుమతించలేదు.

రెండు మిషన్లలో టెస్టింగ్ అనుమతి

Advertisement

NASA రెండు మిషన్లలో స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేయనుంది. Crew-12, Artemis II మిషన్లలో ఈ అనుమతి ఇచ్చారు. ఇది కేవలం టెస్టింగ్ కోసమే. ఫోన్లు స్ట్రిక్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాస్ అవ్వాలి. స్పేస్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌కు ఇబ్బంది కలగకూడదు. బ్యాటరీ, కెమెరా, కనెక్టివిటీ పర్‌ఫామెన్స్‌ని ఇంజినీర్లు దగ్గరగా మానిటర్ చేస్తారు. ఫలితాల ఆధారంగా భవిష్యత్ పాలసీలు నిర్ణయిస్తారు.

Also Read: మీ ఫోన్‌లో ఉన్న పవర్ బటన్‌తో ఎన్నో ఉపయోగాలు.. ఈ సీక్రెట్ ఫీచర్స్ చాలామందికి తెలియవు

ఆస్ట్రోనాట్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్

స్మార్ట్‌ఫోన్లతో ఆస్ట్రోనాట్లు సహజంగా రోజువారీ యాక్టివిటీలు రికార్డ్ చేయవచ్చు. ఎమోషన్స్, రియాక్షన్స్ క్యాప్చర్ చేయవచ్చు. ఇది స్పేస్ మిషన్లను మానవీయంగా చూపిస్తుంది. పబ్లిక్ ఆసక్తి పెరుగుతుంది. భూమిపై ఉన్నవారు రియల్ మూమెంట్స్ చూడవచ్చు. ఆస్ట్రోనాట్లు నార్మల్ లైఫ్‌తో కనెక్ట్ అయి ఉంటారు. ఇది మెంటల్ హెల్త్‌కు కూడా సహాయపడుతుంది.

భవిష్యత్ మిషన్లకు ఏమిటి అర్థం?

ఈ అడుగు భవిష్యత్ స్పేస్ ట్రావెల్‌ను మార్చవచ్చు. స్మార్ట్‌ఫోన్లు సాధారణ ఎక్విప్‌మెంట్ అవుతాయి. సోషల్ మీడియా షేరింగ్, లైవ్‌స్ట్రీమింగ్ సాధ్యమవుతాయి. మిషన్లు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. టెస్టింగ్ విజయవంతమైతే స్మార్ట్‌ఫోన్లు రెగ్యులర్‌గా ఉపయోగించవచ్చు. ఇది స్పేస్ ఎకస్‌పీరియన్స్‌ని పూర్తిగా మార్చేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×