E-Paper
Advertisement

స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న మోటరోలా ఫోల్డబుల్ ఫోన్లు.. ఆ క్రేజీ ఫీచర్లకు టెక్ ప్రియులంతా ఫిదా!

స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న మోటరోలా ఫోల్డబుల్ ఫోన్లు.. ఆ క్రేజీ ఫీచర్లకు టెక్ ప్రియులంతా ఫిదా!
Advertisement

Motorola Razr 70 Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి ఇది నిజంగా గుడ్ న్యూస్. మోటరోలా నుంచి రాబోతున్న రేజర్ 70 సిరీస్ ఫోన్లు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఫోన్ అంటే కేవలం ఫీచర్లు మాత్రమే కాదు.. చూడటానికి కూడా అదిరిపోవాలనుకునే వారి కోసం మోటరోలా ఈసారి చాలా స్పెషల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రేజర్ 70, రేజర్ 70 అల్ట్రా పేరుతో వస్తున్న ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. పాత మోడల్స్ కంటే ఎంతో రిచ్‌గా, ప్రీమియం లుక్‌తో కనువిందు చేయబోతున్నాయి.

ఆకట్టుకోనున్న కలర్స్..

రీసెంట్‌గా లీకైన ఫొటోలను చూస్తుంటే.. ఈ ఫోన్లు డిజైన్ పరంగా నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా రేజర్ 70 మోడల్ గ్రీన్, గ్రే రంగుల్లో కొత్త టెక్స్‌చర్‌తో భలేగా ఉంది. ఇక అల్ట్రా మోడల్ అయితే మరింత వెరైటీగా.. బ్లూ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్‌తో పాటు ఏకంగా వుడ్ (చెక్క) ఫినిషింగ్‌తో కూడా రాబోతోందట. చేతిలో పట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా, విభిన్నంగా ఉండేలా వీటిని తయారు చేశారు. ఫోన్ మడత పెట్టే హింజ్ కూడా ఈసారి చాలా స్లిమ్‌గా ఉండబోతోంది.

Advertisement

Also Read: లాంచ్‌కు ముందే Vivo X300 FE ధర లీక్.. ఈ ‘అర్బన్ ఆలివ్’ లుక్ చూస్తే ఐఫోన్ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే!

పవర్‌ఫుల్ ప్రాసెసర్లు..

ఈసారి స్క్రీన్ సైజు విషయంలోనూ మోటరోలా రాజీ పడలేదు. రేజర్ 70 అల్ట్రాలో 7 అంగుళాల మెయిన్ స్క్రీన్‌తో పాటు, బయటి వైపు 4 అంగుళాల పెద్ద కవర్ స్క్రీన్ ఉండబోతోంది. దీంతో అస్తమానం ఫోన్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. బయటి స్క్రీన్ మీదనే మెసేజ్‌లు చూడటం, పాటలు మార్చడం లాంటివి చేసేయొచ్చు. ఇక వేగం విషయానికొస్తే.. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 లాంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్లను వాడుతున్నారు. దీనివల్ల గేమ్స్ ఆడినా, భారీ యాప్స్ వాడినా ఫోన్ స్లో అవ్వదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్..

Advertisement

ఫొటోగ్రఫీ పిచ్చి ఉన్నవారికి ఈ ఫోన్ ఒక స్వీట్ షాక్. వెనుక వైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో సాధారణంగా బ్యాటరీ త్వరగా అయిపోతుందనే భయం ఉంటుంది కానీ, దీనిలో దాదాపు 4,800mAh బ్యాటరీ ఇస్తున్నారు. దీనివల్ల ఛార్జింగ్ టెన్షన్ లేకుండా రోజంతా వాడుకోవచ్చు. వీటికి తోడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్, నీళ్లు పడినా ఏమీ కాకుండా వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. త్వరలోనే ఇవి భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

Also Read: AI చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. వచ్చేసింది GPT-5.5, ఇక కోడింగ్ చిటికెలో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×