E-Paper
Advertisement

రెడ్, బ్లూ, గ్రీన్.. ఏ కలర్ గ్రీజ్ ఎందుకు వాడుతారో తెలుసా?

రెడ్, బ్లూ, గ్రీన్.. ఏ కలర్ గ్రీజ్ ఎందుకు వాడుతారో తెలుసా?
Advertisement

Types of Grease and Their Uses: వాహనాలు, యంత్రాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేయాలంటే గ్రీజ్ చాలా ముఖ్యం. చాలా మందికి గ్రీజ్ అనేది ఒకటే అనుకుంటారు. కానీ, అది చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా గ్రీజ్ రంగును బట్టి దాని ఉపయోగం, లక్షణాలు మారుతాయి. ప్రతి రంగు వెనుక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ ఏ గ్రీజ్ ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ రెడ్ కలర్ గ్రీజ్

సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఈ గ్రీజ్ ను  తయారు చేస్తారు. ఇది ఎక్కువగా లిథియం కాంప్లెక్స్ ఆధారంగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండే భాగాల్లో బాగా పనిచేస్తుంది. కారు వీల్ బేరింగ్‌లు, బ్రేక్ భాగాలు, హెవీ డ్యూటీ వాహనాల్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు. అధిక ఒత్తిడి, వేడి ఉన్న చోట ఈ గ్రీజ్ మంచి రక్షణ ఇస్తుంది.

⦿ బ్లూ కలర్ గ్రీజ్

Advertisement

దీనిని నీటి నిరోధకత కోసం ఉపయోగిస్తారు. ఇది నీటిలో కరగదు. ఈజీగా తొలగిపోదు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో,  నీటితో సంబంధం ఉన్న యంత్రాల్లో చాలా ఉపయోగకరం. బోట్ ట్రైలర్లు, మెరైన్ యంత్రాలు, వ్యవసాయ పరికరాల్లో ఈ కలర్ గ్రీజ్ ను ఎక్కువగా వాడుతారు.

⦿ బ్లాక్ కలర్ గ్రీజ్‌

ఎక్కువ బరువులను మోసే  యంత్రాల్లో దీనిని ఉపయోగిస్తారు. ఇందులో మోలిబ్డినం డైసల్ఫైడ్, గ్రాఫైట్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఘర్షణను తగ్గించడంలో ఉపయోగపడుతాయి. నిర్మాణ యంత్రాలు, CV జాయింట్లు లాంటి భాగాల్లో వాడుతారు.

⦿ గ్రీన్ కలర్ గ్రీజ్

Advertisement

ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికతో పాటు నీటి నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. పారిశ్రామిక యంత్రాలు, ట్రాక్టర్లు, సీల్డ్ భాగాల్లో ఉపయోగిస్తారు. దీని వల్ల యంత్రాల పనితీరు స్థిరంగా ఉంటుంది.

⦿ వైట్ కలర్ గ్రీజ్

పరిశుభ్రత అవసరమైన చోట ఉపయోగిస్తారు. దీనిని ఫుడ్ గ్రేడ్ గ్రీజ్‌ గా కూడా పిలుస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలు, డోర్ హింజ్‌ లు, లాక్స్ లాంటి తేలికపాటి పనుల్లో వాడతారు. ఇది మురికి తక్కువగా పడేలా చేస్తుంది. శుభ్రంగా ఉంటుంది.

అయితే, గ్రీజ్ ఎంచుకునేటప్పుడు కేవలం రంగును చూసి నిర్ణయం తీసుకోవడం సరిపోదు. ప్రతి గ్రీజ్‌కు NLGI గ్రేడ్ ఉంటుంది. ఆ గ్రీజ్ గాఢతను సూచిస్తుంది. తయారీదారు ఇచ్చిన సూచనలు కూడా చూడాలి. వాటిని పాటించకపోతే యంత్రాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సరైన గ్రీజ్‌ ను సరైన విధంగా ఉపయోగిస్తే వాహనాలు, యంత్రాలు మరింత సురక్షితంగా పనిచేస్తాయి.

Read Also: ఏంటీ.. కార్ల లైట్లకూ ఓ భాష ఉంటుందా? ప్రతీ డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాలండోయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×