E-Paper
Advertisement

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!
Advertisement

Motorola Edge 70 Pro+: ప్రముఖ మోటోరోలా కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అడుగుపెట్టింది. ఎడ్జ్ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా Motorola Edge 70 Pro+ విడుదలవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ఫ్యూజన్, Edge 70 Pro మోడల్స్ సరసన ఇది చేరనుంది. ప్రో మోడల్‌తో పోలిస్తే.. ఇందులో ప్రత్యేకంగా పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందించారు. రూ.45,000 పైబడిన ప్రీమియం ధరల విభాగంలో మోటోరోలా తీసుకొచ్చిన మొదటి Pro Plus వేరియంట్ ఇదే కావడం విశేషం.

సేల్స్ ఎప్పటి నుంచంటే?

మన దేశంలో Motorola Edge 70 Pro+ కేవలం ఒకే ఒక్క వేరియంట్‌లో లభిస్తుంది. 12GB RAM, 256GB స్టోరేజ్ గల ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.47,999గా నిర్ణయించింది. చికోరి కాఫీ, జిన్‌ఫాండెల్, స్టార్మీ సీ అనే మూడు ఆకర్షణీయమైన పాంటోన్ కలర్స్‌లో ఇది లభిస్తుంది. జూన్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్లతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో దీని విక్రయాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ కింద రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

ఐదేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంది కాబట్టి గేమ్స్ ఆడటానికి, మూవీస్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఫోన్ లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌ను అమర్చారు. హీటింగ్ సమస్యలు రాకుండా లోసలే కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో నడిచే ఈ ఫోన్‌కు 3 ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఫోన్ వెనుక భాగంలో 50MP క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ కెమెరా,3.5x ఆప్టికల్ జూమ్ ఇచ్చే 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అన్ని లెన్స్‌ల ద్వారా 4K వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. Motorola Edge 70 Pro+లో భారీ 6,500mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 90W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పటిష్టమైన రక్షణ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది.

Also Read: పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×