E-Paper
Advertisement

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !
Advertisement

Usman khan:  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah). యార్కర్లు వేయడంలో మనోడు దిట్ట. ముఖ్యంగా డెత్ ఓవర్లలో… ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తాడు. పరుగులు కట్టడి చేయడమే కాకుండా, యార్కర్లు వేసి వికెట్ల వేట మొదలు పెడతాడు. క్రికెట్ చరిత్రలో… మన టీమిండియా జట్టుకు దొరికిన ఆణిముత్యమే ఈ జస్‌ప్రీత్ బుమ్రా. అయితే అలాంటి భూమి రా పై పాకిస్తాన్ ఆటగాడు ఉస్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎంతో మంది బౌలర్లను తాను ఎదుర్కొన్నా… కానీ జస్‌ప్రీత్ బుమ్రా లాంటి డేంజర్ బౌలర్ ను ఎదుర్కోవడం నరకంతో సమానం అంటూ బాంబు పేల్చారు. ఇప్పటికీ ఎప్పటికీ బుమ్రా ప్రమాదకరమైన ఆటగాడేనని వెల్లడించారు. అతన్ని ఎదుర్కోవడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు ఉస్మాన్ ఖాన్ ( Usman khan). బుమ్రా బంతుల‌కు పాకిస్తాన్ క్రికెట‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవ‌డం గ్యారెంటీ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Advertisement

ప్రపంచ స్టార్ బౌలర్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టి… టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు. అయితే అలాంటి బుమ్రాపైన ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాడు సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచంలో తాను ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నానని, కానీ బుమ్రాను మాత్రం తట్టుకోవడం తన వల్ల కాదంటూ పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ ఖాన్ బాంబు పేల్చారు. ఇప్పటికీ ఎప్పటికీ బుమ్రా అత్యున్నత బౌలర్ అంటూ కితాబిచ్చారు. అతని బౌలింగ్ ఎదుర్కోవాలంటే అసాధ్యమని… చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ వ్యాఖ్యానించారు. తన వల్ల మాత్రం బుమ్రాను ఎదుర్కోవడం కాదంటూ కామెంట్స్ చేశారు. బుమ్రా విసిరే వైవిద్యమైన బంతులు.. క‌చ్చితమైన యార్కర్లు… బ్యాటర్లకు నరకాన్ని చూపిస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశారు ఉస్మాన్ ఖాన్. టి20 ప్రపంచ కప్ తో పాటు ఆసియా కప్ అలాగే ద్వైపాక్షిక సిరీస్ లలో.. బుమ్రా వేసిన బౌలింగ్ శైలిని తాను గమనించినట్లు వెల్లడించారు. నియంత్రణతో అద్భుతమైన బౌలింగ్ చేసి… పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా అతన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదంటూ వెల్లడించారు.

పాకిస్తాన్ పై బుమ్రా రికార్డులు

పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైన బుమ్రాకు మంచి రికార్డులే ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఆసియా కప్ 2025 సందర్భంగా కూడా ఓ మ్యాచ్ లో 28 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. 2024 t20 ప్రపంచ కప్ సందర్భంగా 14 పరుగులు ఇచ్చి పాకిస్తాన్ టాప్ ఆర్డర్ కూల్చాడు.

Advertisement

 

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

 

 

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×