E-Paper
Advertisement

పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. Motorola Edge 70 Max ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. Motorola Edge 70 Max ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Motorola Edge 70 Max: ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా తమ ఎడ్జ్ 70 సిరీస్‌లో ఐదో ఫోన్‌గా ‘ఎడ్జ్ 70 మాక్స్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్లలో అమ్మకానికి రానుంది. మూడు ఆకర్షణీయమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ భారీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.

భారత్‌లో మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్ బేస్ వేరియంట్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.54,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధరను రూ.59,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: భారత్‌లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై పనిచేస్తుంది. దీనికి మూడేళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్స్, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. దీనిలో 6.8 ఇంచుల క్యూహెచ్‌డీ+ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 7000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

Advertisement

ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో వెనుక వైపు ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీని ద్వారా 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో భారీ 7,100mAh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 58 గంటల వరకు నిలిచి ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 90W వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.

Also Read: ఇక ఫొటోలు నెక్ట్స్ లెవెల్ అంతే.. 200MP కెమెరాతో వస్తున్న హానర్ ‘రోబోట్ ఫోన్’.. ఫీచర్లు లీక్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×