E-Paper
Advertisement

Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!

Diesel Theft: విజయవాడ హైవేపై కొత్త గ్యాంగ్ హల్ చల్.. వీళ్ల దొంగతనం చూస్తే మైండ్ బ్లాక్!
Advertisement

Diesel Theft: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఇప్పుడు ఈ ముఠా లారీడ్రైవర్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పాపం, లాంగ్ జర్నీ చేసి అలసిపోయిన డ్రైవర్లు కాసేపు కునుకు తీద్దామని లారీని పక్కకు పార్క్ చేస్తే చాలు.. నిమిషాల్లో ట్యాంక్ ఖాళీ అయిపోతోంది. నార్కట్‌పల్లి – చిట్యాల మధ్య డీజిల్‌ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వీళ్ల రూటే సపరేటు. లగ్జరీ కార్లలో వస్తారు, లారీ పక్కన ఆపుతారు. డ్రైవర్ నిద్రపోతున్నాడని కన్ఫర్మ్ చేసుకోగానే, పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చి ట్యాంక్‌లోని డీజిల్ మొత్తాన్ని లాగేస్తున్నారు.

జంకుతున్న డ్రైవర్లు..

డీజిల్ దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో క్లియర్‌గా రికార్డ్ అయ్యాయి. కార్లలో వచ్చి క్యాన్ల కొద్దీ డీజిల్ ఎత్తుకెళ్తున్న విజువల్స్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ వరుస చోరీలతో ఇప్పుడు లారీ డ్రైవర్లు హైవేపై బండి ఆపాలంటేనే వణికిపోతున్నారు. డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో.. వేల రూపాయల డీజిల్ ఒక్క రాత్రిలో మాయమైపోతే ఆ నష్టం డ్రైవర్లు, ఓనర్లు ఎలా భరిస్తారు? నిద్ర లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయనే ముప్పు ఒక పక్క, నిద్ర పోతే- డీజిల్ దొంగల తలనొప్పి మరోపక్క తమను వేధిస్తున్నట్టు వాపోతున్నారు డ్రైవర్లు.

Advertisement

Also read: YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్.. హీటెక్కిన ఏపీ రాజీకీయం!

హైటెక్ డీజిల్ దొంగల ముఠా..

హైవే పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయంలో వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు నెంబర్లను గుర్తించి, ఈ హైటెక్ డీజిల్ దొంగల ముఠాను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి లారీ ఓనర్ల అసోసియేషన్లు డిమాండ్లు చేస్తున్నారు.

Advertisement

Storey By:Appa Rao Big Tv

Also Read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×