E-Paper
Advertisement

మోటరోలా నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో Edge 70 Max!

మోటరోలా నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో Edge 70 Max!
Advertisement

Motorola Edge 70 Max: ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా తమ పాపులర్ ఎడ్జ్ సిరీస్‌ను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. ఈ లైనప్‌లో ‘మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్’ అనే సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్కెటింగ్ ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. సరికొత్త క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్, ఎడ్జ్ 70 సిరీస్‌లోనే అత్యంత ఖరీదైన, శక్తివంతమైన మోడల్‌గా నిలవనుంది.

ఆకట్టుకునే డిజైన్.. ఫ్లాట్ డిస్‌ప్లే:

సాధారణంగా మోటరోలా ఎడ్జ్ సిరీస్ ఫోన్లలో కర్వ్‌డ్ స్క్రీన్లు కనిపిస్తుంటాయి. కానీ ఈసారి కంపెనీ రూట్ మార్చింది. ఎడ్జ్ 70 మాక్స్ ఫోన్‌ను ఫ్లాట్ డిస్‌ప్లేతో డిజైన్ చేసినట్లు లీకైన చిత్రాలు చెబుతున్నాయి. స్క్రీన్ ప్రొటెక్టర్లు వాడేవారికి ఇది నిజంగా మంచి విషయమే. ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్‌లో ఉండే కెమెరా బంప్, అందులో మూడు కెమెరాలు అమర్చారు. వాల్యూమ్, పవర్ బటన్లతో పాటు ఫోన్ సైడ్‌లో ఒక అదనపు హార్డ్‌వేర్ బటన్‌ను కూడా మోటరోలా ఇస్తోంది. ఇది గ్లేసియర్ బ్లూ, ఆనిక్స్ బ్లాక్, సేజ్ గ్రీన్ అనే మూడు అదిరిపోయే రంగుల్లో లభించనుంది.

Advertisement

Also Read: మీరు ఏ పాట విన్నారో, ఏం మాట్లాడారో గుర్తుంచుకునే Pixel AI ఫీచర్.. మరి ప్రైవసీ సంగతేంటి?

తిరుగులేని పెర్ఫార్మెన్స్:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధానాంశం దీని ప్రాసెసర్. క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను ఇందులో వాడుతున్నట్లు సమాచారం. ఈ చిప్ గనుక నిజంగానే వస్తే.. గేమింగ్ ప్రియులకు, హెవీ టాస్క్‌లు చేసేవారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఛాయిస్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కూడా ఇందులో నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నాయి.

ప్రొఫెషనల్ లెవెల్ కెమెరాలు:

Advertisement

ఫొటోగ్రఫీని ఇష్టపడేవారి కోసం మోటరోలా దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో మెయిన్ కెమెరాతో పాటు, దూరంగా ఉన్న వాటిని స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి టెలిఫోటో లెన్స్, వైడ్ యాంగిల్ షాట్స్ కోసం అల్ట్రావైడ్ కెమెరాను అందిస్తున్నారు. ఇక సెల్ఫీల కోసం డిస్‌ప్లే పైభాగంలో మధ్యలో పంచ్-హోల్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా ప్రొఫెషనల్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని లీకులు స్పష్టం చేస్తున్నాయి.

మిలిటరీ గ్రేడ్ గట్టిదనం:

ఈ ఫోన్ కేవలం చూడ్డానికే కాదు.. వాడకంలోనూ చాలా గట్టిది. దీనికి మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే కింద పడినా, వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చినా, వేడి లేదా చలిని తట్టుకుని ఇది సులభంగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ లాంచ్ తేదీపై మోటరోలా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ లీకులు చూస్తుంటే ఈ పవర్‌ఫుల్ ఫోన్ చాలా త్వరలోనే మార్కెట్లోకి వచ్చేలా కనిపిస్తోంది.

Also Read: వాస్కులర్ డిసీజ్ అంత ప్రమాదకరమా? కాళ్ల నొప్పులు, మధుమేహంతో దీనికి ఉన్న లింక్ ఏంటి?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×