E-Paper
Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కేటీఆర్ ఫ్రీ ప‌బ్లిసిటీ! స్పీడ్ త‌గ్గిన సినీ కేరీర్‌కు ఇలా ఉడ‌తాభ‌క్తి సాయం..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కేటీఆర్ ఫ్రీ ప‌బ్లిసిటీ! స్పీడ్ త‌గ్గిన సినీ కేరీర్‌కు ఇలా ఉడ‌తాభ‌క్తి సాయం..!
Advertisement

తెలంగాణ హీరో. క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన నేప‌థ్యం. తెలంగాణ యాస‌ను ఒడిసిప‌ట్టి.. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన క‌థా నాయ‌కుడు.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కానీ గ‌త కొంత‌కాలంగా ఆయ‌న‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు. టైమ్ బాగా లేన‌ట్టుంది. ర‌ష్మిక‌ను పెళ్లి చేసుకోవ‌డ‌మ‌నే టాస్క్‌ను గెలిచి.. జీవితంలో త‌న కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశాడు గానీ, సినిమాల్లో పూర్తిగా వేగం త‌గ్గింది.

పూరీ భారీ అంచ‌నాల‌తో తీసిన లైగర్‌కు ముందు .. ఆ త‌రువాత ఇక క‌నిపించ‌డం లేదు. అడ‌పాద‌డ‌పా కొన్ని యాడ్స్‌లో న‌టిస్తున్నాడు. బాగా చ‌దివే పిల్ల‌ల‌కు ప్రోత్సాహ‌కాలందిస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు న‌వ దంప‌తులు. ఇదంతా ఎందుకూ అస‌లు ముచ్చ‌టకు వ‌ద్దాం! విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కెరీర్ క‌ష్ట‌కాలంలో ఫ్రీ ప‌బ్లిసిటీ చేస్తున్నాడు కేటీఆర్‌. ప‌దే ప‌దే అత‌ని పేరు.. అత‌ని సినిమా పేరు జ‌పిస్తున్నాడు. వేదిక‌ల మీద ఇదే ముచ్చ‌ట వ‌ళ్లె వేస్తున్నాడు. దీనికి ప‌రోక్షంగా రేవంత్ రెడ్డే కార‌ణం.

Advertisement

రేవంత్‌రెడ్డి సీఎంగా ఘోరంగా ఫెయిల్ అయ్యాడ‌ని చెప్పాల‌నేది కేటీఆర్ ఉద్దేశ్యం. దీన్ని ఎలా జ‌నాల‌కు క‌నెక్ట‌య్యాలే చెప్పాలి..? అని బాగా ఆలోచించి.. రేవంత్‌రెడ్డి సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింద‌ని చెప్ప‌డానికి.. అర్జున్‌రెడ్డి సినిమాను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటున్నాడు. అర్జున్‌రెడ్డి సినిమా ఎంత హిట్ట‌య్యిందో తెలుసు క‌దా! విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్టార్‌డ‌మ్ తెచ్చి పెట్టిన సినిమా అది. ఒకేసారి ఈ సినిమాతో పెద్ద హీరోల స‌ర‌స‌న చేరిపోయాడు మ‌నోడు.. అని మొద‌లుపెట్టి, మ‌రి మ‌న రేవంత్ రెడ్డి సినిమా ఫ‌స్ట్ హాఫ్‌లోనే అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది అని చెబుతున్నాడు.

ఇంకా సగం సినిమా ఉన్నా.. చూసిన ఈ స‌గంలోనే తేలిపోయింది. అది అట్ట‌ర్ ఫ్లాప‌ని..! ఇప్పుడే జ‌నాలు లేచి వెళ్లిపోతున్నారు… సినిమా థియేట‌ర్ నుంచి. ఇక ఆ స‌గం సినిమా ఎట్లుంటుందో వారికి తెలిసిపోయింది..! అంటూ రేవంత్ పాల‌న‌ను ఇలా అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చి చూపుతున్నాడు. ఒక్క‌సారి కాదు. పదే ప‌దే!

Advertisement

వ‌రుస‌గా బీఆరెస్ పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగులు జ‌రుగుతున్నాయి. సిటీలోని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా రోజుకో చోట పెట్టుకుంటున్నారు మీటింగులు. ప‌నిలో ప‌నిగా అందులోనే స‌ర్ కు సంబంధించి త‌మ పార్టీ బూత్‌లెవ‌ల్ ఏజెంట్లు చేయాల్సిన బాధ్య‌త‌ల‌ను గురించి దీంట్లో వివ‌రిస్తున్నాడు కేటీఆర్‌. అంత‌కు ముందుగా కేటీఆర్ చేసే ప్ర‌సంగం.. అర్జున్‌రెడ్డితోనే మొద‌లు పెడుతున్నాడు.

ఇలా త‌న ఇష్ట‌మైన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరును జ‌నాల‌కు గుర్తు చేయ‌డంతో పాటు.. అత‌ని సూప‌ర్ హిట్ సినిమాను మ‌రోసారి యాదికి తెస్తూనే.. రేవంత్‌రెడ్డి అనే సినిమా.. అంటూ రెండింటికీ ఆపాదిస్తూ .. ఒక‌టి హిట్టు.. మ‌రోటి ఫ‌ట్టు అనే విధంగా ప్రాస‌కు బాగా కుదిర్చి.. జ‌నాల మెద‌ళ్ల‌లోకి నేరుగా జొప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు కేటీఆర్‌.

అర్జున్‌రెడ్డిని ఈ విధంగా త‌న పార్టీ కోసం ఉప‌యోగించుకుంటున్నాడ‌న్న మాట‌.జ‌నాలు మ‌రిచిపోతున్న విజ‌య్ పేరును ఈ విధంగా లైవ్‌లో ఉంచే ప్ర‌య‌త్న‌మూ జ‌రుగుతున్న‌ది కేటీఆర్ ప్ర‌సంగాలతో. బ‌హుశా ఈ విష‌యం విజ‌య్‌కు తెలిసిందో లేదో మ‌రి. తెలిస్తే వ‌చ్చి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పి పోతాడు కావొచ్చు. ఎంతైనా పాత ప‌రిచ‌యం.. జిగ్రీ దోస్తులే క‌దా!

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×