E-Paper
Advertisement

Motorola Edge 70 Fusion: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్స్, ఐఫోన్ రేంజ్ డిస్‌ప్లే!

Motorola Edge 70 Fusion: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్స్, ఐఫోన్ రేంజ్ డిస్‌ప్లే!
Advertisement

Motorola Edge 70 Fusion: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోటో ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ఫ్యూజన్ వేరియంట్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా రూ.25 వేల ధరలో ఒక బ్రాండెడ్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక ఆప్షన్‌గా నిలుస్తోంది. స్టైలిష్ లుక్ మాత్రమే కాకుండా, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ రాజీ పడకుండా కంపెనీ దీనిని డిజైన్ చేసింది.

ఈ Motorola Edge 70 Fusion ప్రధాన ఆకర్షణ దీని 6.78 అంగుళాల సూపర్‌ హెచ్‌డీ 1.5K అమోలెడ్ డిస్‌ప్లే. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ దీనికి అదనపు బలాన్ని ఇస్తుంది.

Advertisement

ఇకపోతే ఈ స్మార్ట్‌ఫోన్‌ లోపల స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు భవిష్యత్తులోనూ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ హామీ ఇచ్చింది.

Also Read: ప్రతినెలా కరెంట్ బిల్లు షాకిస్తోందా? ఈ 6 పొరపాట్లే మీ కొంప ముంచుతున్నాయి!

Advertisement

సాధారణంగా స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కానీ మోటో కొత్త ఫోన్‌లో ఏకంగా 7000 mAh భారీ బ్యాటరీని అమర్చింది. దీనికి తోడు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల ఛార్జింగ్ సమస్య తలెత్తదు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు 193 గ్రాములకే పరిమితం కావడం విశేషం.

కొత్తగా వచ్చిన ఈ మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు 50 మెగాపిక్సల్ సోనీ సెన్సార్‌తో కూడిన మెయిన్ కెమెరా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.26,999 కాగా.. బ్యాంక్ ఆఫర్లు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఉపయోగించుకుంటే దీనిని కేవలం రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. ఇతర వేరియంట్లు రూ.29,999, రూ.32,999 ధరల్లో లభిస్తాయి. మార్చి 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో వీటి విక్రయాలు మొదలవుతాయి.

Also Read: కరెంటు బిల్లును 33% తగ్గించే కొత్త ఏసీ టెక్నాలజీ.. ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల ముందడుగు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×