E-Paper
Advertisement

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..
Advertisement

Motorola Edge 2026 Price in India: స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో క్లీన్ సాఫ్ట్‌వేర్, స్టైలిష్ డిజైన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ‘మోటోరోలా’ సరి కొత్త సంచలనానికి తెరలేపింది. కస్టమర్లు ఎంతో కాలంగా.. ఎదురు చూస్తున్న తమ ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ ఫోన్ “Motorola Edge 2026” ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. లేటెస్ట్ 6.3-ఇంచుల కాంపాక్ట్ డిస్‌ప్లే, సరి కొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7450 (MediaTek Dimensity 7450) ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మొబైల్, యూజర్లకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ ఫీచర్లు: 

Advertisement

ఆకట్టుకునే డిస్‌ప్లే & డిజైన్ :
ప్రస్తుతం మార్కెట్లో చాలా ఫోన్లు పెద్ద సైజులో వస్తున్న వేళ, మోటోరోలా ఈసారి చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేలా 6.3-ఇంచుల స్క్రీన్‌ను ఎంచుకుంది. ఇది కేవలం పట్టుకోవడానికే కాదు. వాడుకకు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది ఒక pOLED డిస్‌ప్లే తో వస్తుంది. ఇందులో 144Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు లేదా అప్లికేషన్లు వాడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. దీని డిజైన్ విషయానికి వస్తే.. వెనక వైపు ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో.. చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది.

పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్ :
ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా.. మీడియాటెక్ కంపెనీకి చెందిన సరికొత్త MediaTek Dimensity 7450 SoC ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఈ చిప్‌సెట్ వల్ల మల్టీ టాస్కింగ్, భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌లను ఎక్కడా లాగ్ లేకుండా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి.. హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో బేసిక్ వేరియంట్ 8GB రామ్ (RAM), 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రారంభమవుతుంది.

Advertisement

అదిరిపోయే కెమెరా క్వాలిటీ:
ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం మోటోరోలా ఎడ్జ్ 2026 లో అద్భుతమైన కెమెరా సెటప్ ఇచ్చారు.

రియర్ కెమెరా: వెనక వైపు 50 మెగాపిక్సెల్ (50MP)ప్రైమరీ కెమెరాను OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో ఇచ్చారు. దీని వల్ల వీడియోలు తీసేటప్పుడు ఫోన్ ఊగినా సరే బ్లర్ అవ్వకుండా క్లియర్ విజువల్స్ వస్తాయి. దీనితో పాటుగా 13MP వైడ్-యాంగిల్ , మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: రీల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ (32MP) హై-రెజల్యూషన్ కెమెరాను అమర్చారు.

బ్యాటరీ, ఛార్జింగ్:
ఇంత స్లిమ్ ఫోన్ అయినప్పటికీ.. ఇందులో రోజంతా హ్యాపీగా సరిపోయే బ్యాటరీని ఇచ్చారు. అంతేకాదు.. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌తో.. కూడిన ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి ఎలాంటి అనవసరమైన యాడ్స్ రావు.

Motorola Edge 2026 ధరల వివరాలు:
ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ మిడ్-రేంజ్ ప్రీమియం విభాగంలో పోటీ పడనుంది.

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్: దీని లాంచ్ ధర సుమారుగా రూ. 32,999 మధ్య ఉండే అవకాశం ఉంది.

బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుంటే.. ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకే లభించే ఛాన్స్ ఉంది.

మీరు ఒకవేళ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండి, చేతిలో ఇమిడిపోయేలా ఉంటూనే.. కెమెరా, ప్రాసెసర్ పరంగా ది బెస్ట్ అనిపించే 5G మొబైల్ కోసం చూస్తుంటే.. Motorola Edge 2026 మీకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో మోటోరోలా ఇస్తున్న ఫీచర్లు ఖచ్చితంగా ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తాయని చెప్పొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×