E-Paper
Advertisement

‘తెలంగాణ మా జాగీరే’.. పవన్ కళ్యాణ్‌పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్!

‘తెలంగాణ మా జాగీరే’.. పవన్ కళ్యాణ్‌పై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్!
Advertisement

Gaddar Daughter: ‘తెలంగాణ మీ జాగీరా’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవును, ఇది తమ జాగీరే అంటూ ఆమె బదులిచ్చారు. ‘తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జారీర్. ఈ రోజు మా జాగీర్. రేపు మా బిడ్డల జాగీర్’ అని స్పష్టం చేశారు. సినిమా నటుడిగా, గద్దర్ ఫ్యాన్ గా పవన్ ను తాము అభిమానిస్తామని వెన్నెల అన్నారు. అలాగనీ తెలంగాణ గురించి ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

తెలంగాణ ఆవీర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వాఖ్యలను ఈ రాష్ట్ర ఆడబిడ్డగా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెన్నెల అన్నారు. సినిమాల్లో నటిస్తేనో, పొత్తులు పెట్టుకుంటేనే తెలంగాణ రాలేదని పవన్ కు కౌంటర్ ఇచ్చారు. తమ రక్తం చిందించుకొని తెలంగాణను సాధించుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఎవరినీ బాధపెట్టకుండా, ఎవరినీ హింసించకుండా తనను తాను ఆహుతీ చేసుకున్న శ్రీకాంత చారీనే తెలంగాణ ఆవీర్భావానికి సజీవ సాక్ష్యమని ఆమె అన్నారు.

Advertisement

మా భూములు మావి, మా పాలన మాది, మా నీరు మావి అని సాధించుకున్న గడ్డ తెలంగాణ అని గద్దర్ కూతురు గుర్తుచేశారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదన్నారు. ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదన్నారు. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారని గద్దర్ కుమార్తె వెన్నెల గుర్తు చేశారు.

Advertisement

Also Read: కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు.. రైతుల పట్ల బాధ్యత లేదా? ఎంపీ చామల నిలదీత

మంగళవారం హైదరాబాద్ నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తన ప్రసంగంలో గద్దర్ గురించి కూడా ప్రస్తవావించారు. గద్దర్ బతికి ఉన్నప్పుడు ఆయన గురించి పట్టించుకోని వారే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. కానీ నా సూటి ప్రశ్న ఒక్కటే. గద్దరన్న బతికి ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఆయనకు మీరేం చేశారు?. ఒరేయ్ తమ్మీ, వెన్నులో బుల్లెట్ల వల్ల నడవలేకపోతున్నా. ఆటోలో తిరగలేకపోతున్నా. ఒక బండి కొనివ్వరా అని గద్దర్ నన్ను అడిగారు. నేను 24 గంటల్లోనే ఆయనకు కారు కొనిచ్చాను. ఈ విషయంలో నేనెప్పుడు చెప్పలేదు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

Also Read: రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×