E-Paper
Advertisement

అదిరిపోయే డిజైన్, పిచ్చెక్కించే బేస్.. మోటో కొత్త బడ్స్ రచ్చ

అదిరిపోయే డిజైన్, పిచ్చెక్కించే బేస్.. మోటో కొత్త బడ్స్ రచ్చ
Advertisement

Moto Buds 2 Review:  ఇయర్ బడ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టల్ క్లియర్ సౌండ్, చెవుల్లో హోరు తగ్గించే ANC. మార్కెట్లోకి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన Moto Buds 2 ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. “How Much Bass Is Too Much Bass?” అనే రేంజ్‌లో దీని బేస్ పర్ఫార్మెన్స్ గురించి చర్చ నడుస్తోంది. 55dB డైనమిక్ ANC, స్టైలిష్ పాంటోన్ కలర్స్, మైండ్ బ్లాక్ చేసే బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ బడ్స్ నిజంగానే మ్యూజిక్ లవర్స్‌ కు పిచ్చెక్కించేస్తున్నాయా? ఈ లేటెస్ట్ మోటో బడ్స్ 2 ఫుల్ రివ్యూ మీకోసం!
Moto Buds 2 ఫుల్ రివ్యూ:

1. క్లాసీ లుక్.. అదిరిపోయే డిజైన్:

మొదటి చూపులోనే మోటో బడ్స్ 2 మనల్ని కట్టి పడేస్తాయి. ఎందుకంటే.. ఇవి క్లాసిక్ , ట్రెండీ Pantone క్యూరేటెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కార్బన్, గ్రే మిస్ట్, వైలెట్ ఐస్ వంటి కలర్స్ చూడటానికి చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. కేస్ ట్రాన్స్‌లూసెంట్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇయర్‌బడ్స్ చాలా లైట్‌వెయిట్‌గా ఉండి, చెవుల్లో పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతాయి. మీరు వర్కౌట్స్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా ఇవి అస్సలు ఊడిపోవు. పైగా వీటికి IP54 రేటింగ్ ఉంది. కాబట్టి జిమ్ చెమటలకు, చిన్నపాటి వర్షపు జల్లులకు భయపడాల్సిన పనే లేదు.

2.బేస్: 

Advertisement

ఇక అసలు విషయానికి వస్తే.. మోటో బడ్స్ 2 లో 11mm Dynamic Drivers తో పాటు 6mm Micro Planar Magnetic Drivers కాంబినేషన్‌ను ఇచ్చారు. దీని వల్ల సౌండ్ అవుట్‌పుట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అయితే.. ఇందులో బేస్ మాత్రం చాలా హెవీగా ఉంది. మీరు గనక ‘Bass Boost’ ఫీచర్ ఆన్ చేస్తే.. మీ చెవుల్లో మినీ ఆంప్లిఫైయర్లు పెట్టినట్లుగా బేస్ దరువేస్తుంది.

“How Much Bass Is Too Much Bass?” అనే ప్రశ్న ఇక్కడే వస్తుంది. కొందరికి గుండెల్లో.. రైళ్లు పరిగెత్తేలా హెవీ బేస్ ఉంటేనే నచ్చుతుంది. అలాంటి వారికి ఇది పండగే! కానీ.. మెలోడీస్ వినేవారికి, క్రిస్టల్ క్లియర్ వోకల్స్ (Vocals) ఆశించేవారికి ఈ బేస్ కొంచెం ఎక్కువైంది అనిపించవచ్చు. అయితే.. ‘Moto Buds App’ ద్వారా ఈక్వలైజర్ సెట్ చేసుకుని 50% వాల్యూమ్‌లో వింటే సౌండ్, ట్రెబుల్ బ్యాలెన్స్‌డ్‌గా చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. ఇందులో LDAC, LHDC 5.0 హై-రెస్ ఆడియో కోడెక్స్ సపోర్ట్ ఉండటం విశేషం.

Advertisement

ఈ ప్రైస్ సెగ్మెంట్లోనే బెస్ట్ అనిపించేలా మోటో ఇందులో 55dB(ANC) ని అందించింది. ఆఫీస్ గోలగోలగా ఉన్నా, జర్నీలో బస్సు, ట్రైన్ సౌండ్స్ వస్తున్నా.. ఈ ANC ఆన్ చేస్తే చాలు, చుట్టూ ఉన్న ప్రపంచం సైలెంట్ అయిపోతుంది. అలాగే, బయటి సౌండ్స్ వినడానికి ‘Smart Transparency Mode’ కూడా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. కాల్స్ మాట్లాడటానికి ఇందులో 6-Mic System ఇచ్చారు, కాబట్టి మీ వాయిస్ అవతలి వారికి ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా క్లియర్‌గా వెళ్తుంది.

Also Read: బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్, అస్సలు మిస్సవ్వొద్దు

3.బ్యాటరీ లైఫ్.. కనెక్టివిటీ:

కనెక్టివిటీ పరంగా ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ 6.0 , డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ ఉంది. అంటే ఒకేసారి లాప్‌టాప్, మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కేస్‌తో కలిపి దాదాపు 48 నుంచి 53 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 3 గంటల పాటు వాడుకోవచ్చు.

మోటో బడ్స్ 2 లో ఫీచర్లు అన్నీ బాగున్నాయి కానీ.. దీనికి సంబంధించిన ‘Moto Buds App’ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. మీ దగ్గర ఒకవేళ iPhone ఉంటే మాత్రం ఈ యాప్ సపోర్ట్ దొరకదు. ఇది ఐఫోన్ యూజర్లకు కాస్త నిరాశ కలిగించే విషయమే.

మీకు పంచ్ ఇచ్చే హెవీ బేస్ కావాలి, సూపర్బ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండాలి, అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ ముఖ్యం అనుకుంటే.. కళ్ళు మూసుకుని Moto Buds 2 కి వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ ధరలో ఇదొక సాలిడ్ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×