E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌తో రెండ్రోజులు నాన్‌స్టాఫ్ మ్యూజిక్.. Moto Buds 2 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

సింగిల్ ఛార్జ్‌తో రెండ్రోజులు నాన్‌స్టాఫ్ మ్యూజిక్.. Moto Buds 2 ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Moto buds 2: ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా భారత మార్కెట్లోకి ‘Moto buds 2’ ను మే 19న విడుదల చేయనుంది. Moto G37, Moto G37 Power ఫోన్లతో పాటే ఈ ఇయర్ బడ్స్ కూడా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే గ్లోబల్ మార్కెట్లో సందడి చేసిన ఈ బడ్స్.. ఇప్పుడు ఇండియాలోకి రానున్నాయి. ఇప్పుడీ క్రేజీ గ్యాడ్జెట్స్ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళ్లిపోదాం..

ఈ Moto buds 2 సౌండ్ క్వాలిటీ విషయంలో మోటరోలా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుంది. దీనిలో 11mm డైనమిక్ డ్రైవర్, 6mm మైక్రో ప్లానార్ మాగ్నెటిక్ డ్రైవర్లను పెట్టారు. దీనివల్ల బ్లూటూత్ ద్వారా పాటలు విన్నా సరే, చాలా స్పష్టంగా, క్లియర్‌గా వినిపిస్తాయి. పైగా ఈ బడ్స్‌లో ఉన్న స్పాషియల్ ఆడియో ఫీచర్ వల్ల ఏదో థియేటర్లో కూర్చుని వింటున్నట్టు 360 డిగ్రీల సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే గేమ్స్ ఆడేవాళ్ల కోసం స్పెషల్ మోడ్ కూడా ఇచ్చారు.

Advertisement

Also Read: Samsung Galaxy Z Flip 8 లీక్స్.. డిజైన్ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది మామా.. ఆ క్రేజీ ఫీచర్ కూడా!

సాధారనంగా జర్నీలో ఉన్నప్పుడో లేదా బయట తిరుగుతున్నప్పుడో చుట్టుపక్కల శబ్దాలు ఎక్కువగా వస్తుంటాయి. దీని కోసం ఈ బడ్స్‌లో 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇచ్చారు. తద్వారా చుట్టుపక్కల ఉండే గోలను బట్టి ఇది ఆటోమేటిక్‌గా సౌండ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. అలాగే ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే స్మార్ట్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక కాల్స్ మాట్లాడటానికి 6 మైకులు పెట్టారు కాబట్టి.. ఎంత గాలి వీచినా మన వాయిస్ అవతలి వాళ్లకు క్లియర్‌గా వినిపిస్తుంది.

Advertisement

ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 10 నుండి 11 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. అదే ఛార్జింగ్ కేస్‌తో కలిపి వాడితే ఏకంగా 48 నుండి 53 గంటల వరకు బ్యాటరీ వస్తుంది. ఒకవేళ అర్జంట్‌గా బయటకు వెళ్లాల్సి వస్తే.. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ పెడితే చాలు.. హ్యాపీగా 3 గంటల పాటు పాటలు వినొచ్చు.

యూకే మార్కెట్లో ఈ మోటో బడ్స్ 2 ధర సుమారు రూ.9,000 వరకు ఉంటుంది. కానీ, ఇండియాలోకి వచ్చేసరికి టాప్ మోడల్ ధర రూ.5,999గా ఉండొచ్చని సమాచారం. కాబట్టి ఈ నార్మల్ మోటో బడ్స్ 2 ధర అంతకంటే చాలా తక్కువగానే ఉండే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అయితే మీ బ్యాగ్‌లో ఈ లాంగ్ బ్యాటరీ స్పీకర్ ఉండాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×