E-Paper
Advertisement

మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!

మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. తగ్గనున్న రీఛార్జ్ భారం!
Advertisement

Recharge Prices: ప్రస్తుతం పెరిగిన మొబైల్ టారిఫ్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. ఇది వరకు రోజులతో పోలీస్తే అది సామాన్యులకు తలకు మించిన భారం అవుతోంది. అయితే, త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనివ్వనున్నాయి.

Read also-మిడిల్ క్లాస్ ఇష్టపడే ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ కార్లు ఇవే.. ఫీచర్లు పిచ్చెక్కిస్తాయి..

ధరలు తగ్గే అవకాశం

కేవలం వాయిస్ కాలింగ్ ప్లాన్లు (Voice-Only Plans)

Advertisement

ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు డేటా కాలింగ్ కలిపి ఉన్న ప్లాన్లనే విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ అవసరం లేని సాధారణ ఫోన్ వినియోగదారులు (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు, వృద్ధులు) కూడా అనవసరంగా డేటా కోసం అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది. TRAI ఇప్పుడు కేవలం ‘వాయిస్ కాలింగ్’ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను ప్రవేశపెట్టాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది.

ఎంట్రీ-లెవల్ ప్లాన్ల ధరల తగ్గింపు

గత ఏడాది జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీనిపై సామాన్యుల నుండి తీవ్ర అసహనం వ్యక్తమైంది. కనీస రీఛార్జ్ ధరలు పెరగడంతో లక్షలాది మంది వినియోగదారులు తమ సిమ్ కార్డులను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా బేసిక్ రీఛార్జ్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

Read also-రైలు సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ.. ixigo, Swiggy కొత్త సర్వీస్ షురూ!

వాలిడిటీ ప్లాన్లలో

సాధారణంగా నెల రీఛార్జ్ అంటే 28 రోజులే ఉండటంపై వినియోగదారుల్లో అసంతృప్తి ఉంది. దీనిని సరిదిద్ది, పూర్తి 30 రోజుల వాలిడిటీతో పాటు, సరసమైన ధరలకే లాంగ్-టర్మ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది.

ఎవరికి లాభం?

సాధారణ ఫోన్ వినియోగదారులు కీప్యాడ్ ఫోన్లు వాడుతూ కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే మొబైల్ వాడే వారికి ఇది పెద్ద ఊరట. వైఫై అందుబాటులో ఉండి మొబైల్ డేటా అవసరం లేని వారికి తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్లు దొరుకుతాయి. రీఛార్జ్ ఖర్చుల భారం తగ్గడం వల్ల నెలకు కొంత పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. టెలికాం రంగంలో పోటీ పెరగడం ప్రభుత్వ నియంత్రణ సంస్థల జోక్యంతో త్వరలోనే కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలైతే, మొబైల్ రీఛార్జ్ అనేది విలాసంగా కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే అవసరంగా మారుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×