// // మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి -->
E-Paper
Advertisement

మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి

మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి
Advertisement

Kids Crowd Safety| పిల్లలు అల్లరి చేస్తుండడం సహజమే. అందుకే వారి పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా వివాహాలు, జాతర, షాపింగ్ మాల్స్ వంటి గుంపు స్థలాల్లో జనం రద్దీగా ఉంటారు. ఇలాంది ప్రదేశాల్లో పిల్లలు తప్పిపోయే ప్రమాదముంది. ఈ భయం ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. గుంపులో పిల్లలు గందరగోళానికి గురై భయపడతారు. ఇలాంటి సమయంలో పిల్లలు ఏం చేయాలో తెలిస్తే వారు సురక్షితంగా ఉండవచ్చు. బయటకు వెళ్లేముందు పిల్లలకు కొన్ని సరళమైన భద్రతా నియమాలు నేర్పించడం చాలా ముఖ్యం.

పిల్లలకు తమ పూర్తి వివరాలు నేర్పించాలి

పిల్లలు తమ పూర్తి పేరు స్పష్టంగా చెప్పగలగాలి. తల్లిదండ్రుల పేర్లు కూడా బాగా నేర్చుకోవాలి. వారి ఇంటి అడ్రస్, నగరం పేరు కూడా తెలిసి ఉండాలి. పిల్లలు తమ ఇంటికి దూరమైతే ఇతరులకు ఈ సమాచారం చెప్పడం ద్వారా వారు మళ్లీ తమ ఇంటికి చేరడానికి సాయపడుతుంది. ఇంట్లోనే రోజూ ఈ వివరాలు ప్రాక్టీస్ చేయండి. ఇది అత్యవసర సమయంలో పిల్లలకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది.

ముఖ్యమైన ఫోన్ నంబర్లు గుర్తుంచుకోవాలి

Advertisement

పిల్లలు కనీసం ఒక ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు ముఖ్యం. మరొక విశ్వసనీయ కుటుంబ సభ్యుడి నంబర్ కూడా నేర్పించండి. ఉదాహరణకు వారి మామ, బాబాయ్, లేదా పక్కింటి వారి నెంబర్. ఇలా చేస్తే తప్పిపోయినప్పుడు త్వరగా సహాయం పొందవచ్చు. ఎప్పుడు, ఎలా ఈ నెంబర్లు చెప్పాలో కూడా నేర్పించండి.

భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి

పిల్లలు తప్పిపోతే భయంతో పరుగెత్తడం సాధారణం. ఇలా చేస్తే తల్లిదండ్రులకు వారిని కనుగొనడం కష్టం అవుతుంది. తప్పిపోతే ఒక చోట నిలబడి ఉండాలని నేర్పించండి. చుట్టూ తిరగకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా చేస్తే త్వరగా వారిని కనుగొనే అవకాశం ఎక్కువ.

సరైన వ్యక్తిని సహాయం కోసం అడగాలి

Advertisement

పబ్లిక్ ప్లేస్‌లలో ఎవరిని నమ్మాలో పిల్లలు తెలుసుకోవాలి. పోలీసు అధికారులు లేదా సెక్యూరిటీ గార్డుల వద్దకు వెళ్లాలని పిల్లలకు నేర్పాలి. దుకాణదారులు లేదా పిల్లలతో ఉన్న కుటుంబాలను కూడా సంప్రదించవచ్చు. “నేను తప్పిపోయాను” అనే పదాలు స్పష్టంగా చెప్పడం నేర్పించండి. ఇది త్వరగా సహాయం అందుకోవడానికి ఉపయోగపడుతుంది.

సంప్రదింపు వివరాలు ఎప్పుడూ తన వద్ద ఉంచుకోవాలి

పిల్లల చేతికి ఫోన్ నంబర్ రాసి ఉంచండి లేదా వారి జేబులో చిన్న నోటు పెట్టండి. పిల్లలు భయంతో మాట్లాడలేకపోయినా ఈ వివరాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చర్యలు అత్యవసర సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

తల్లిదండ్రులకు అదనపు సేఫ్టీ టిప్స్

గుంపులోకి వెళ్లేముందు పిల్లలతో మాట్లాడండి. తప్పిపోతే ఏం చేయాలో వివరంగా చెప్పండి. బయటకు వెళ్లేముందు పిల్లల ఇటీవలి ఫోటో తీసుకోండి. “నాకు సహాయం కావాలి” అని బిగ్గరగా అరవడం నేర్పించండి. ఇది “అమ్మా” లేదా “నాన్నా” అని పిలవడం కంటే ఎక్కువ దృష్టి ఆకర్షిస్తుంది.

Also Read: మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదా? సహజంగా ఎత్తు పెరగడానికి ఈ ఆహారాలు తినిపించండి

ఈ నియమాలు ఎందుకు ముఖ్యం?

పిల్లలు తప్పిపోతే ఏం చేయాలో తెలియక భయపడతారు. ఈ సులభమైన నియమాలు వారికి ఆత్మవిశ్వాసం ఇస్తాయి. విపరీత పరిస్థితుల్లో కూడా సిద్ధంగా ఉండటం వల్ల తల్లిదండ్రులు, పిల్లలు భయపడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

జనం రద్దీగా, గుంపుగా ఉన్న స్థలాల్లో సరైన జాగ్రత్తలు పాటింకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. తల్లిదండ్రులు సులభంగా ఈ భద్రతా నియమాలు నేర్పించాలి. ఇంట్లోనే రోజూ ప్రాక్టీస్ చేయండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×