E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ మినీ ఫ్రిజ్..బ్యాచిలర్స్,ఆఫీసులకు బెస్ట్

తక్కువ ధరలో బెస్ట్ మినీ ఫ్రిజ్..బ్యాచిలర్స్,ఆఫీసులకు బెస్ట్
Advertisement

Mitashi 46 L single door refrigerator: ప్రస్తుత కాలంలో ఫ్రిజ్ అనేది ప్రతి ఒక్కరి ఇంటికి తప్పనిసరిగా మారిపోయింది. అయితే పెద్ద కుటుంబాలకు పెద్ద ఫ్రిజ్‌లు అవసరమైనప్పటికీ, సింగిల్ రూమ్స్‌లో ఉండేవారు, బ్యాచిలర్స్, స్టూడెంట్స్ లేదా చిన్న ఆఫీసుల కోసం కాంపాక్ట్ సైజులో ఉండే చిన్న ఫ్రిజ్‌లు సరిగ్గా సరిపోతాయి. అలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మోడల్ మిటాషి (Mitashi) 46 లీటర్ల సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. దీని ఫీచర్లు, ధర వంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.కాంపాక్ట్ డిజైన్,స్పేస్ సేవింగ్:

ఈ ఫ్రిజ్ ముఖ్యంగా దాని కాంపాక్ట్ సైజుతో అందరినీ ఆకట్టుకుంటుంది. కిచెన్‌లో లేదా గదిలో చాలా తక్కువ స్థలాన్ని మాత్రమే ఇది ఆక్రమిస్తుంది. తక్కువ జాగా ఉన్న ప్రదేశాలలో దీన్ని చాలా ఈజీగా సర్దుకోవచ్చు. దీని స్టైలిష్ లుక్ ఇంటి ఇంటీరియర్‌కు సరి కొత్త అందాన్ని తెస్తుంది. సింగిల్ డోర్ డిజైన్ ఉండటం వల్ల దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ.

2. డైరెక్ట్ కూల్ టెక్నాలజీ:

Advertisement

ఇది డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని వల్ల లోపల ఆహార పదార్థాలు, డ్రింక్స్ చాలా త్వరగా చల్లబడతాయి. రోజూవారీ అవసరాలకు కావలసిన పాలు, కూరగాయలు, చాక్లెట్లు లేదా నీళ్ల బాటిళ్లను స్టోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. చిన్న పాటి ఫ్రీజర్ స్పేస్ కూడా ఇందులో ఉండటం వల్ల ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి కూడా వీలవుతుంది.

3.మెయింటెనెన్స్:

ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది 2-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి తక్కువ కరెంట్‌ను వినియోగించుకుంటుంది. దీని మెయింటైనెన్స్ కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా డీఫ్రాస్ట్ చేసుకోవాల్సి వస్తే ఈజీగా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.599 కే స్మార్ట్‌వాచ్..ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు తెలుసా?

4. ధర:

మార్కెట్లో లభించే ఇతర పెద్ద బ్రాండ్ల ఫ్రిజ్‌లతో.. పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఆన్‌లైన్ సేల్స్ , ఆఫర్లలో దీని ధర కేవలం రూ.6,499 వరకు ఉండటం దీనికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన కూలింగ్ సేవలు కోరుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

మీరు తక్కువ ఖర్చులో, చిన్న సైజులో ఉండే ఒక మంచి మినీ ఫ్రిజ్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే .. ఈ ఫ్రిజ్ ఒక చక్కటి ఎంపిక అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో.. చక్కటి కూలింగ్ ఎఫెక్ట్‌ను అందించే ఈ ఫ్రిజ్ బ్యాచిలర్స్ , చిన్న అవసరాలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×