E-Paper
Advertisement

పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?

పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?
Advertisement

Pooja Hegde:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా సరే క్షణాలలో వైరల్ అవుతుంది. అందులో భాగంగానే హీరోయిన్స్ ఎవరితోనైనా చనువుగా ఉన్నా.. లేదా వారు పెళ్లీడుకు వచ్చిన సరే వారిపై ఇలా పెళ్లి రూమర్లు సృష్టిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ జనరేషన్ ని బట్టి చూస్తే చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చిన వారిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ కి సిద్ధమైనట్లు సమాచారం. ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకోవడానికి పూజా హెగ్డే ఆసక్తి కనబరుస్తోందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఎప్పుడు చూద్దాం..

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే..

అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే. తన గ్లామర్, అభినయంతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను దోచుకున్న ఈ చిన్నది.. ఒకప్పుడు తన అంద చందాలతో టాలీవుడ్ ను ఊపేసింది. అలా వైకుంఠపురంలో చిత్రంలో బుట్ట బొమ్మగా నిలిచిపోయిన ఈమె. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లభించడం లేదు. కానీ కొన్ని రోజులుగా ఈమె పెళ్లి వార్తలతో వైరల్ గా మారుతోంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ ఫిలింనగర్ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Advertisement

ALSO READ:మా నాన్న విజయ్ తో హాలీవుడ్ మూవీ తీస్తా – జేసన్ సంజయ్

పెద్దలు కుదిర్చిన వివాహానికే తొలి ప్రాధాన్యత..

ఈ మేరకు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సడన్గా ఈమె వైవాహిక బంధం లోకి అడుగు పెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రేమ వివాహం కాదని.. పూర్తిగా కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లేనని తెలుస్తోంది . ఇంట్లో వారు చూసిన సంబంధానికి పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఆమె చేసుకోబోయే వరుడు సినీ రంగానికి చెందినవారా ? లేక బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న బడా వ్యాపారవేత్త ? లేదా మరేదైనా బ్యాక్ గ్రౌండ్ ఉందా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పటివరకు పూజా హెగ్డే లేదా ఆమె టీం నుంచీ ఇటువంటి వార్తలపై ఏ విధంగా స్పందించకపోయినా.. పూజా హెగ్డే మాత్రం అరెంజ్ మ్యారేజ్ కి సిద్ధమయ్యింది అంటూ వస్తున్న వార్తలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పూజా హెగ్డే సినిమాలు..

Advertisement

ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు స్పెషల్ సాంగ్ లతో ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే చివరిగా విజయ్ జననాయగన్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈమె దుల్కర్ సల్మాన్ శ్రీ శ్రీ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా పూజా హెగ్డేకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి . ఒకవేళ ఈ సినిమా కూడా ప్లాప్ అయితే ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు లభించడం అతి కష్టమే అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×