E-Paper
Advertisement

నోకియా లుమియా డిజైన్‌తో AI ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

నోకియా లుమియా డిజైన్‌తో AI ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
Advertisement

HMD Touch AI: ప్రముఖ HMD సంస్థ చైనాలో ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. అదే ‘HMD Touch AI’. పాత తరం నోకియా లుమియా మోడళ్లను గుర్తుచేసేలా డిజైన్ చేసిన ఈ ఫోన్.. సాధారణ ఫీచర్ ఫోన్ల లాంటిది కాదు. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు టచ్ స్క్రీన్‌ను కూడా అందించడం విశేషం.

లుమియా డిజైన్..

ఈ ఫోన్ 3.2 ఇంచుల టచ్ స్క్రీన్‌తో వస్తుంది. వెనుక వైపు గుండ్రటి కెమెరా మాడ్యూల్‌తో క్లాసిక్ సయాన్ కలర్‌లో ఆకట్టుకుంటుంది. యూజర్లకు నచ్చినట్లు మార్చుకోవడానికి పసుపు, నీలం, తెలుపు రంగుల్లో కవర్లు కూడా లభిస్తాయి. ఆన్ స్క్రీన్ టెక్ట్స్‌ను గట్టిగా చదివి వినిపించే వాయిస్ బ్రాడ్‌కాస్ట్ ఫీచర్ ఇందులో మరొక ప్రత్యేకత.

Advertisement

Also Read: గూగుల్ పిక్సెల్ వాచ్ 5 లీక్.. భారీ RAM, అధునాతన AI ఫీచర్లతో రాబోతున్న కొత్త స్మార్ట్‌వాచ్!

బైట్‌డాన్స్ AIతో స్మార్ట్ ఫీచర్లు..

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌కు చెందిన ‘దౌబావో AI’ మోడల్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనిలో కథలు చెప్పడం, భావోద్వేగ సలహాలు ఇవ్వడం, ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించడం లాంటి 6 రకాల AI అసిస్టెంట్లు ఉన్నాయి. పిల్లలకు హోమ్‌వర్క్ సహాయం కోసం నేరుగా ఆన్సర్లు ఇవ్వకుండా.. సమస్యను ఎలా పరిష్కరించాలో ఇది వివరిస్తుంది. అలాగే టెక్ట్స్ ఆధారంగా బొమ్మలు గీసే AI ఆర్ట్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా అండ్ కనెక్టివిటీ..

Advertisement

ఫొటోల కోసం వెనుక 2 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ముందు భాగంలో మరో కెమెరా ఇచ్చారు. AI సాయంతో ఫొటోలను యానిమేషన్, కామిక్ స్టైల్స్‌లోకి మార్చుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. డ్యూయల్ 4G, వైఫై, హాట్‌స్పాట్, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి పైభాగంలో SOS బటన్, రోజంతా నడిచే 1,950mAh బ్యాటరీని అమర్చారు.

ధర ఎంతంటే?

స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలనుకునే వారికి, పిల్లలకు ఇది మంచి ఆప్షన్. ఇందులో థర్డ్ పార్టీ యాప్స్ లేదా రీల్స్ చూడటానికి కుదరదు. దీని ధర సుమారు రూ.6,700గా ఉంది. డిజిటల్ డిటాక్స్ కోరుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది.

Also Read: 4.2GHz స్పీడ్‌తో శాంసంగ్ కొత్త ప్రాసెసర్.. ఇక మార్కెట్‌లో మిగతా కంపెనీలకు కష్టమేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×