E-Paper
Advertisement

గూగుల్ పిక్సెల్ వాచ్ 5 లీక్.. భారీ RAM, అధునాతన AI ఫీచర్లతో రాబోతున్న కొత్త స్మార్ట్‌వాచ్!

గూగుల్ పిక్సెల్ వాచ్ 5 లీక్.. భారీ RAM, అధునాతన AI ఫీచర్లతో రాబోతున్న కొత్త స్మార్ట్‌వాచ్!
Advertisement

Google Pixel Watch 5: గూగుల్ తమ సరికొత్త ‘పిక్సెల్ వాచ్ 5’ను త్వరలోనే నిర్వహించబోయే Made By Google ఈవెంట్‌లో అధికారికంగా పరిచయం చేయనుంది. అయితే.. లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్‌వాచ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో ప్రత్యక్షమైంది. ‘గాడ్రిక్’ అనే కోడ్‌నేమ్‌తో కనిపిస్తున్న ఈ లిస్టింగ్ ద్వారా వాచ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి.

ర్యామ్ పెంపుతో మెరుగైన పనితీరు:

ఈసారి Pixel Watch 5లో మెమరీని పెంచుతున్నట్లు తెలుస్తోంది. క్రితం మోడల్ అయిన Pixel Watch 4లో 2GB ర్యామ్ ఉండగా.. ఈ కొత్త వెర్షన్‌లో 3GB ర్యామ్ అందించనున్నారు. ఈ అదనపు ర్యామ్ వల్ల జెమిని ఆధారిత ఏఐ (AI) ఫీచర్లు, ఆన్-డివైజ్ టాస్క్‌లు మరింత వేగంగా పనిచేస్తాయి.

Advertisement

Also Read: 4.2GHz స్పీడ్‌తో శాంసంగ్ కొత్త ప్రాసెసర్.. ఇక మార్కెట్‌లో మిగతా కంపెనీలకు కష్టమేనా?

ప్రాసెసర్, డిజైన్ వివరాలు:

ప్రాసెసర్ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. క్వాల్కమ్ SW5100 చిప్‌సెట్‌నే ఇందులోనూ ఉపయోగిస్తున్నారు. ఇది నాలుగు కోర్ల CPU, అడ్రినో 702 GPUతో రానుంది. డిజైన్ పరంగా పాత మోడల్స్‌ను పోలి ఉన్నప్పటికీ.. ఇది సరికొత్త ‘వేర్ OS 7’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో, కొత్త హెల్త్ యాప్‌తో రాబోతోంది.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

ఈ వాచ్ బేస్ వేరియంట్ (41mm) ధర దాదాపు రూ.46,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 12న పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లతో పాటు ఈ స్మార్ట్‌వాచ్‌ను గూగుల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు 20 నుంచి ఇది అమ్మకానికి వావచ్చని తాజా లీక్స్ ద్వారా తెలుస్తోంది. అప్పటి వరకు గూగుల్ ప్రియులు ఈ వాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూడక తప్పదనే చెప్పాలి.

Also Read: ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరా డిజైన్‌లో ఊహించని మార్పులు.. పూర్తి వివరాలు మీ కోసం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×