E-Paper
Advertisement

Google Pixel Discount: గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై రూ.40000 తగ్గింపు.. ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో బెస్ట్ డీల్

Google Pixel Discount: గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై రూ.40000 తగ్గింపు.. ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో బెస్ట్ డీల్
Advertisement

Google Pixel Discount| మీరు గూగుల్ పిక్సెల్ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? కానీ బడ్జెట్ తక్కువ ఉందని వెనుకడుగు వేస్తున్నారా? అయితే మీ కోసం ఈ అవకాశం. ప్రస్తుతం అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ పిక్సెల్ ఫోన్ ధరలో పెద్ద కోతతో పాటు బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే అదనపు సేవింగ్స్ కూడా చేయవచ్చు. గూగుల్ పిక్సెల్ 8 ఆఫర్లు, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి సింపుల్‌గా మీ కోసం..

గూగుల్ పిక్సెల్ 8 ధర, ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 8 (8GB RAM + 128GB స్టోరేజ్) వేరియంట్ అమెజాన్‌లో రూ.38,499కి లిస్ట్ అయింది. 2023 అక్టోబర్‌లో రూ.75,999 ధరకు ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ అయింది. అంటే ఇప్పుడు దాదాపు రూ.40,000 తగ్గింపు!

Advertisement

బ్యాంక్ ఆఫర్: ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 7.5% (మాక్సిమమ్ రూ.3,000 వరకు) డిస్కౌంట్ వస్తుంది. దీంతో ఫైనల్ ధర రూ.35,611కి తగ్గుతుంది.
ఎక్స్‌చేంజ్ ఆఫర్: పాత ఫోన్ ఇస్తే రూ.36,350 వరకు ఎక్స్‌ట్రా సేవింగ్స్. కానీ ఈ మొత్తం మీ పాత ఫోన్ మోడల్, కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల FHD+ OLED స్క్రీన్. రిజల్యూషన్ 1080×2400 పిక్సెల్స్, 90Hz రిఫ్రెష్ రేట్. చూడటానికి సూపర్ క్లియర్, స్మూత్.
ప్రాసెసర్: గూగుల్ Tensor G3 చిప్ + Titan M2 సెక్యూరిటీ చిప్ ప్రాసెసర్ తో ఫోన్ రన్ అవుతుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ ఫోన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది.

కెమెరా:

Advertisement

రియర్ (వెనుక) : 50 మెగాపిక్సెల్ ఆక్టా-PD మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. ఫోటోలు ప్రొఫెషనల్ లెవెల్‌లో వస్తాయి.
ఫ్రంట్: 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది.

బ్యాటరీ: 4575mAh బ్యాటరీ. 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఒక్క ఛార్జ్‌తో ఒక రోజంతా సులభంగా రన్ అవుతుంది.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్. గూగుల్ నుంచి 7 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గ్యారంటీ.

డిజైన్:

పొడవు: 150.50 mm, వెడల్పు: 70.80 mm, మందం: 8.90 mm.
బరువు: 187 గ్రాములు
చిన్న సైజు, లైట్ వెయిట్ – ఒక చేత్తో సులభంగా ఉపయోగించవచ్చు.

ఈ ఫోన్‌లో గూగుల్ AI ఫీచర్లు (మ్యాజిక్ ఎరేజర్, బెస్ట్ టేక్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్) కూడా ఉన్నాయి. ఫోటో ఎడిటింగ్, వీడియో కాల్స్ సూపర్ ఈజీ అవుతాయి.

ఎందుకు కొనాలి?

రూ.75,999 నుంచి రూ.35,611కి తగ్గింది – దాదాపు సగం ధరకే వస్తోంది.
ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, లాంగ్-టర్మ్ అప్‌డేట్స్ లభిస్తాయి.
టాప్-క్లాస్ కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్.
అన్నింటికి మించి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం ఫోన్.

అమెజాన్‌లో ఈ డీల్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. త్వరగా చెక్ చేసి, బ్యాంక్ + ఎక్స్‌చేంజ్ ఆఫర్ల లాభాలు పొందండి. గూగుల్ పిక్సెల్ 8 – మీ బడ్జెట్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఫోన్.

Also Read: ప్రపంచంలోనే మొదటి 400MP కెమెరాఫోన్.. ఫొటోగ్రఫీ రంగంలో వివో సంచలనం

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×