E-Paper
Advertisement

Galaxy Z Fold Discount: శాంసంగ్ కొత్త ఫోల్డెబుల్ ఫోన్‌పై గోల్డెన్ ఆఫర్.. రూ.60000 భారీ డిస్కౌంట్

Galaxy Z Fold Discount: శాంసంగ్ కొత్త ఫోల్డెబుల్ ఫోన్‌పై గోల్డెన్ ఆఫర్.. రూ.60000 భారీ డిస్కౌంట్
Advertisement

Galaxy Z Fold Discount| ఫోల్డెబుల్ ఫోన్స్ మార్కెట్‌ని 2026లో కూడా శాంసంగ్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 హై-ఎండ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా బలంగా పోటీ పడుతోంది. ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్, స్మార్ట్ AI ఫీచర్లు, మెరుగైన ఫోల్డబుల్ డిజైన్‌తో ఇది ఇప్పటికీ అద్భుతంగా ఉంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభానికి ముందు ఇప్పుడు ఈ ఫోన్‌పై చాలా పెద్ద ఆఫర్ వచ్చింది.

భారీ ధర తగ్గింపు.. ఇప్పుడే కొనుగోలు చేయండి

అమెజాన్ ఇండియాలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ ఇప్పుడు రూ.1,04,998కి అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో ఈ మోడల్ ధర రూ.1,64,999 ఉండేది. అంటే ఇప్పుడు దాదాపు రూ.60,000 ఆదా అవుతోంది. కొన్ని క్రెడిట్ కార్డ్‌లతో అదనంగా రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఫైనల్ ధర రూ.1,03,498కి దిగివస్తుంది.

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్

Advertisement

అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొంటే అదనంగా రూ.3,149 వరకు క్యాష్‌బ్యాక్ (అమెజాన్ పే బ్యాలెన్స్‌గా) వస్తుంది. ఇది మొత్తం ఖర్చును మరింత తగ్గిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో మరింత ఆదా ఉంది. అర్హత ఉన్న పాత ఫోన్ ఇచ్చి రూ.42,000 వరకు సేవ్ చేయవచ్చు. ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా ఎక్స్‌ఛేంజ్ విలువ మారుతుంది. అలాగే సులభ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ.3,691 నుంచి EMI మొదలవుతుంది. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.

లోపలా, బయటా అద్భుతమైన డిస్‌ప్లే

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6లో రెండు ప్రీమియం డిస్‌ప్లేలు ఉన్నాయి. బయటి కవర్ డిస్‌ప్లే సైజు 6.3 అంగుళాలు ఉంటుంది. లోపలి ఫోల్డబుల్ స్క్రీన్ 7.6 అంగుళాలు డైనమిక్ LTPO AMOLED 2X ప్యానెల్‌తో వస్తుంది. రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. పీక్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ వరకు ఉంటుంది. పగటివేళ ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

ఫ్లాగ్‌షిప్ పర్‌ఫామెన్స్ లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఇది వేగవంతమైన పర్‌ఫామెన్స్, సులభమైన మల్టీటాస్కింగ్ ఇస్తుంది. అడ్వాన్స్‌డ్ గెలాక్సీ AI ఫీచర్లు స్మార్ట్ యూజ్ చేయడానికి సహాయపడతాయి. ఫోన్ Android 14తో వస్తుంది. ఏడు పెద్ద ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ హామీ ఇస్తుంది. దీనివల్ల ఫోన్ చాలా సంవత్సరాల పాటు ఫ్యూచర్-రెడీగా ఉంటుంది.

వర్సటైల్ కెమెరా సెటప్

ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 50MP (OIS సపోర్ట్‌తో). 12MP అల్ట్రా-వైడ్ కెమెరా వైడ్ షాట్లకు. 10MP టెలిఫోటో కెమెరాతో 3x ఆప్టికల్ జూమ్ ఉంది. సెల్ఫీలకు 10MP ఫ్రంట్ కెమెరా. లోపలి స్క్రీన్‌పై 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా దాగి ఉంటుంది. ఇమర్సివ్ వ్యూయింగ్ ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

4400mAh బ్యాటరీ రోజంతా పని, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరిపోతుంది. 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఈ డీల్ ఎందుకు ముఖ్యం?

ఈ భారీ డిస్కౌంట్ వల్ల ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ చాలా మందికి అందుబాటులోకి వస్తోంది. సాధారణంగా పెద్ద సేల్స్ సమయంలో మాత్రమే ఇలాంటి ఆఫర్లు ఇస్తాయి. ఇప్పుడే కొనుగోలు చేస్తే.. భారీగా సేవింగ్స్ చేసుకోవచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×