E-Paper
Advertisement

Caviar Luxury iPhone 17: లగ్జరీ ఐఫోన్ 17 ప్రో ఫోన్లు లాంచ్.. ధర రూ.11 లక్షలకు పైనే.. కానీ

Caviar Luxury iPhone 17: లగ్జరీ ఐఫోన్ 17 ప్రో ఫోన్లు లాంచ్.. ధర రూ.11 లక్షలకు పైనే.. కానీ
Advertisement

Caviar Luxury iPhone 17 Pro Max| ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ కావియర్ (Caviar). ఈ కంపెనీ అన్నీ ప్రీమియం లగ్జరీ ఐటెమ్స్ తయారు చేస్తుంది. చాలాకాలంగా ఐఫోన్స్, ఇతర బ్రాండెడ్ ఐటెమ్స్ కు లగ్జరీ ఎడిషెన్ మోడల్స్ తయారు చేస్తోంది కావియార్. వీటి ధర కూడా లక్షలు, కోట్లలో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా 2025లో విడుదలైన ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17  ప్రో మాక్స్‌ ఫోన్స్ లాంచ్ చేసింది.

ఇవి సాధారణ ఐఫోన్‌లు కావు..  ఒక్కో మోడల్‌ను ఆ బ్రాండ్ కేవలం 19 మందికి మాత్రమే తయారు చేస్తోంది. ఈ కలెక్షన్ పేరు “సీక్రెట్ లవ్” (Secret Love). ఈ డిజైన్స్ అన్నీ ప్రేమ పండుగ (లవ్ ఫెస్టివల్)  సీజన్‌ను సెలబ్రేట్ చేసేలా డిజైన్ చేశారు.

ధరలు వింటేనే కచ్చితంగా షాక్ 

  • సాధారణ మోడల్ “డ్యాన్సింగ్ హార్ట్స్” – $10,200 (భారత కరెన్సీలో రూ.9.15 లక్షలు)
  • “కారమెల్”, “ఎమరాల్డ్ ట్రీ” – $11,630 (రూ.10.45 లక్షలు )
  • టాప్ మోడల్ “ఫ్లూర్ డి లూమియర్” – $13,060 (రూ.11.75 లక్షలు )
Advertisement

ఇవి ఫోన్‌లు కాదు, ఒక్కొక్కటి హస్తకళా ఆభరణాలు లాంటివి!

ఎమరాల్డ్ ట్రీ – క్రిస్మస్ ట్రీ లాంటి ఫోన్

ఇదే ఈ కలెక్షన్‌లో టాప్ డిజైన్. డార్క్ గ్రీన్ (ఆకుపచ్చ) కలర్ లెదర్‌తో తయారు చేశారు. ఫోన్ వెనుక వైపు 24 క్యారెట్ బంగారు ఆభరణాలు పొదిగారు. ఎరుపు రంగు అలంకరణలు క్రిస్మస్ ట్రీ బాల్స్ లాగా మెరుస్తాయి. వీటితో పాటు స్వరోవ్స్కీ క్రిస్టల్స్ కూడా పొదిగారు. ఫోన్ పై లైటింగ్ పడితే ఆభరణాల మెరుపుతో ఫోన్ ఒక్కసారిగా కళకళలాడింది. చూస్తేనే ఫెస్టివ్ ఫీలింగ్ వస్తుంది!

కారమెల్ మోడల్ – లగ్జరీ స్వీట్‌ ఫోన్

Advertisement

కారమెల్ రంగు ఒరిజినల్ లెదర్‌తో తయారు. ఎరుపు-తెలుపు కాంబినేషన్, బంగారు పూల డిజైన్‌లు ఉన్నాయి. సింపుల్ డిజైన్‌లో అద్భుతంగా కనిపించే స్టైల్. ఇది ఖరీదైన ఆభరణాల లాంటి ఫీల్ ఇస్తుంది.

ఫ్లూర్ డి లూమియర్ – లేడీస్ స్పెషల్ ఫోన్

ఈ ఫోన్ పై వెండి రంగు కమీలియా పూలు చెక్కారు. పూల రేకుల్లో ముత్యాలు పొదిగారు. బ్యాక్‌గ్రౌండ్ డార్క్ లెదర్. 24 క్యారెట్ బంగారు పూత, జ్యువెలరీ ఎనామెల్ వర్క్ ఉన్నాయి. ఈ ఫోన్ మహిళల సౌందర్యం, గ్రేస్‌ను సింబలైజ్ చేస్తుంది.

డ్యాన్సింగ్ హార్ట్స్ – ప్రేమికులకు పర్ఫెక్ట్

ఫోన్ డార్క్ బ్లూ (నీలం) లెదర్ బేస్. బంగారు తీగలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. హార్ట్ షేప్‌లో ఇన్‌లే ఉంటాయి. చూస్తేనే డాన్స్ చేయాలనే మూడు వస్తుంది. ఒక సంపూర్ణ  ఆభరణంలా కనిపిస్తుంది.

ఈ ఫోన్‌లు రోజువారీ ఉపయోగానికి కాదు.  సేకరించుకోవడానికి, గర్వంగా చూపించుకోవడానికి మాత్రమే. ప్రపంచంలోనే అతి ధనవంతులు, కలెక్టర్ల కోసమే ఈ లిమిటెడ్ ఎడిషన్‌లను కావియర్ తయారు చేసింది. కావియర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఒక్కో ఫోన్‌ను హస్తకళాకారులు చేత్తో తయారు చేస్తారు. ఇలాంటి ఫోన్లు చాలా తక్కువ సంఖ్యలో అంటే ఒక్కో మోడల్ కేవలం 14 నుంచి 17 మాత్రమే తయారు చేశారు.

Also Read: ప్రజలపై నిఘా.. గూఢచర్యం చేస్తున్న వై ఫై రూటర్లు..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×