E-Paper
Advertisement

Smart Brick: పిల్లల కదలికపై ‘స్మార్ట్ బ్రిక్’ నిఘా.. ఇది ఎలా పనిచేస్తుందంటే?

Smart Brick: పిల్లల కదలికపై ‘స్మార్ట్ బ్రిక్’ నిఘా.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
Advertisement

Smart Brick: నేటి తరం పిల్లలకు LEGO గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నచిన్న బ్రిక్స్‌ని కలుపుతూ పెద్ద పెద్ద అంతస్తులు కట్టేయాలని ముచ్చట పడుతుంటారు. అలాగే వాటితో తమకు ఇష్టమైన బొమ్మలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా చిన్నారుల ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పుకునే లెగో ఇప్పుడు మరో ప్రయోగంతో మన ముందుకు రాబోతుంది. ఈసారి.. మరింత స్మార్ట్‌గా, మరింత అట్రాక్టివ్‌గా పిల్లల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది.

50 ఏళ్లలో అతిపెద్ద మార్పు:

పిల్లల కదలికలకు అనుగుణంగా స్పందించే ‘స్మార్ట్ బ్రిక్’ను లెగో పరిచయం చేసింది. గత 50 ఏళ్లలో లెగో చేసిన అతిపెద్ద మార్పుగా దీనిని కంపెనీ చెబుతోంది. అంటే.. ఈ కొత్త స్మార్ట్ బ్రిక్స్ లోపల అత్యంత చిన్న మైక్రో చిప్స్‌ను అమర్చారు. సెన్సార్ల సహాయంతో ఇవి పిల్లల కదలికలను గమనిస్తూ.. వాటికి అనుగుణంగా స్పందిస్తాయి. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు బ్రిక్స్ డిఫరెంట్ కలర్స్2లో వెలుగుతూ, శబ్దాలు చేస్తూ బొమ్మలకు ప్రాణం పోస్తాయి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న లెగోలతో పోల్చితే.. ఇవి పిల్లల ఆటను మరింత ఉత్సాహభరితంగా మార్చుతుంది అని డెన్మార్క్‌కు చెందిన లెగో సంస్థ ప్రకటించింది.

Advertisement

Also Read: వచ్చేసింది మినీ ప్రొజెక్టర్.. జేబులో పట్టేంత ఈ బుజ్జి గ్యాడ్జెట్ 100 అంగుళాల టీవీతో సమానం!

అందుబాటులోకి ఎప్పుడంటే?

ప్రపంచ ప్రఖ్యాత ‘కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో(CES)’లో.. లాస్ వెగాస్ వేదికగా ఈ స్మార్ట్ బ్రిక్స్‌ను లెగో తొలిసారి ప్రదర్శించింది. ఈ సంస్థ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మందికి పైగా ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక దశలో లెగోతో ఆడుకుని ఉంటారని అంచనా. అంతే కాదు.. అంతర్జాతీయంగా ఏడాదికి దాదాపు 500 కోట్ల గంటలు లెగో బొమ్మలతో చిన్నారులు గడుపుతుంటారంట. అంతటి ఆదరణ ఉన్న ఈ లెగోలో సరికోత్త రూపంలో.. ‘లెగో స్టార్ వార్స్’ సెట్లలో భాగంగా ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు స్మార్ట్ ట్యాగ్‌లు, స్మార్ట్ మినీ బొమ్మలను కూడా లెగో ఆవిష్కరించింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ స్మార్ట్ టెక్నాలజీ అంతా కేవలం 4 మి.మీ. పరిమాణం ఉన్న చిన్న చిప్‌లోనే ఇమిడి ఉంటుంది.

కదలికలకు స్పందించే బిక్స్:

Advertisement

ఈ స్మార్ట్ బ్రిక్స్ పిల్లల కదలికలను మాత్రమే కాదు.. అవి ఎటువైపు ఉన్నాయో కూడా స్వయంగా గుర్తిస్తాయట. ఏ బ్రిక్స్ ఎక్కడ ఉంది, పక్కన ఉన్న వేరే బ్రిక్స్‌తో దానికి ఉన్న సంబంధం ఏమిటో కూడా ఇవి అర్థం చేసుకోగలవట. ప్రతి బ్రిక్స్‌లో ప్రత్యేక ఆడియో సిస్టమ్ ఉండటం వల్ల, పిల్లలు దానిని ఎలా కదిలిస్తే ఆ విధంగా శబ్దాలను మార్చుకుంటాయట. పిల్లల కదలికలకు అనుగుణంగా వెలిగే LED లైట్లు పిల్లలకు ఒక మ్యాజికల్ వరల్డ్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయని కంపెనీ చెబుతోంది.

స్క్రీన్లకు దూరంగా.. క్రియేటివిటీకి దగ్గరగా:

పిల్లలను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ వంటి స్క్రీన్లకు దూరంగా ఉంచి.. ఆటల్లో ఫిజికల్‌గా, మెంటల్‌గా మరింత యాక్టివ్‌గా పాల్గొనేలా చేయడమే ఈ స్మార్ట్ బ్రిక్స్ యొక్క ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించినప్పటికీ.. స్క్రీన్ అవసరం లేకుండా పిల్లల ఊహాశక్తిని పెంపొందించడమే లెగో ప్రత్యేకత.

లెగో ప్రయాణం ఇలా..

1932లో ప్రారంభమైన ఈ లెగో ప్రయాణం.. తొలిసారి చెక్క ముక్కలతో మొదలైంది. ఆ తర్వాత తొలిసారి డెన్మార్క్‌కు చెందిన వడ్రంగి ఓలే కిర్క్ క్రిస్టియన్సెన్ చెక్క ముక్కలతో లెగో బొమ్మలను రూపొందించారు. 1949లో ఇవి ప్లాస్టిక్ రూపంలోకి మారాయి. 1958లో ఆధునిక బ్రిక్ డిజైన్ వచ్చింది. 1978లో మినీ బొమ్మలను పరిచయం చేశారు. ఇప్పుడు, దాదాపు 90 ఏళ్ల చరిత్రలో మరో కీలక మైలురాయిగా స్మార్ట్ బ్రిక్స్ నిలవనున్నాయి.

Also Read: 12,200mAh బ్యాటరీతో రియల్‌మీ ప్యాడ్ 3 భారత్‌లో లాంచ్.. దీని అత్యాధునిక ఫీచర్లకు ఫిదా అయిపోతారు!

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×