E-Paper
Advertisement

Kinetic Green E Luna Prime: కిలో మీటర్ కు జస్ట్ 10 పైసల ఖర్చు, కైనెటిక్ లూనా అదిరింది బ్రో!

Kinetic Green E Luna Prime: కిలో మీటర్ కు జస్ట్ 10 పైసల ఖర్చు, కైనెటిక్ లూనా అదిరింది బ్రో!
Advertisement

ఇండియాలో ఒకప్పుడు సత్తా చాటిన కైనెటిక్ సంస్థ ఇప్పుడు మళ్లీ సంచలనం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నవంబర్ 2025లో ఎలక్ట్రిక్ లూనాను అందుబాటులోకి తీసుకొచ్చింది. కైనెటిక్ గ్రీన్ E లూనా ప్రైమ్ EV స్కూటర్ పేరుతో మార్కెట్ కు పరిచయం చేసింది. ఇండియాలోని కమ్యూటర్ సెగ్మెంట్‌ కు సూటబుల్‌ గా ఉండేలా డిజైన్ చేసింది. మల్టీ యుటిలిటీ వెహికల్‌ గా ఉపయోగపడేలా తీర్చిదిద్దింది. ఎక్కువగా అర్బన్, రూరల్ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ బోలెడు ప్రత్యేకతలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

E-లూనా ప్రైమ్ వేరియంట్స్  

E-లూనా ప్రైమ్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 110 km రేంజ్ వేరియంట్ బేస్ మోడల్. ఇది  2.3 kWh బ్యాటరీతో వస్తుంది. 140 km రేంజ్ వేరియంట్ టాప్ మోడల్. హయ్యర్ బ్యాటరీ కెపాసిటీతోతో వస్తుంది.  ఈ లూనా రేంజ్ విషయానికి వస్తే ఒక్క ఛార్జ్ తో 110 కిలో మీటర్ల నుంచి 140 km రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ 50 కిలో మీటర్లు ఉంటుంది. ఛార్జింగ్ టైమ్ 4 నుంచి 5 గంటలు పడుతుంది.  రన్నింగ్ కాస్ట్ కిలో మీటర్ కు కేవలం 10 నుంచి14 పైసలు అవుతుంది. బ్యాటరీ ఏజ్, రోడ్ కండిషన్స్, లోడ్, టైర్ ప్రెషర్, రైడింగ్ స్టైల్ సహా పలు అంశాల మీద ఆధారపడి ఈ రేంజ్ అనేది ఉంటుంది.

E-లూనా ప్రైమ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్

Advertisement

ఈ స్కూటర్ మోపెడ్ స్టైల్ డిజైన్‌తో వస్తుంది. రగ్డ్ స్టీల్ ఫ్రేమ్, స్ప్లిట్ సీట్, స్పేషియస్ ఫ్లోర్‌ బోర్డ్, ఫ్రంట్ లోడింగ్ ఏరియా, విండ్‌ స్క్రీన్, స్లిమ్ బాడీని కలిగి ఉంటుంది. డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ లెవల్, ట్రిప్ మీటర్ ఉంటుంది. బ్రైట్ LED హెడ్‌ ల్యాంప్, హాలోజన్ హెడ్‌ లైట్, బల్బ్ టెయిల్,  టర్న్ సిగ్నల్స్ ఉంటాయి. USB చార్జింగ్ పోర్ట్, పుష్ బటన్ స్టార్ట్, క్యారీ హుక్, ప్యాసెంజర్ ఫుట్‌ రెస్ట్, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. కాంబి బ్రేక్ సిస్టమ్, ట్యూబ్‌ లెస్ టైర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్, చైన్ డ్రైవ్, హోమ్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.

E-లూనా ప్రైమ్ ధర ఎంత అంటే?

E-లూనా ప్రైమ్ బేస్ వేరియంట్ ధర రూ.82,490 నుంచి ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ ధర రూ.86,000 – రూ.1,08,000 వరకు ఉంటుంది. వేరియంట్ ను బట్టి మారుతుంది. ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ E-లూనా ప్రైమ్ కు సంబంధించి అనుకూల అంశాలతో పాటు కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ముందుగా అనుకూల విషయాలకు వస్తే, అఫర్డబుల్, లాంగ్ రేంజ్, లో రన్నింగ్ కాస్ట్, మల్టీ యూజ్, ప్రీమియం ఫీచర్లు అల్లాయ్ వీల్స్, డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి.  ప్రతికూల అంశాలకు వస్తే పెట్రోల్ రైవల్స్ అయిన టీవీఎస్ ఎక్స్ ఎల్ 100 కంటే ధర ఎక్కువగా ఉంది. టాప్ స్పీడ్ తక్కువగా ఉంది.  వైజర్, విండ్‌ స్క్రీన్ క్వాలిటీపై కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి.

Advertisement

Read Also: సూపర్ లుక్, వావ్ అనిపించే ఫీచర్లు, ఆకట్టుకుంటున్న కొత్త టీవీఎస్ జెస్ట్ 110!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×