E-Paper
Advertisement

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!

యాడ్స్, బ్లోట్‌వేర్ లేని బెస్ట్ 5G ఫోన్.. రూ.12 వేల లోపే లాంచ్ చేసిన లావా!
Advertisement

Lava Bold N2 5G: ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్, బడ్జెట్ ధరలో సరికొత్త 5G మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. Bold N2 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్.. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్ కానుంది. జూన్ 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్ ప్రత్యేకంగా అమ్మకానికి రానుంది.

బడ్జెట్ ధరలో అద్భుతమైన డిస్‌ప్లే:

ఈ సరికొత్త ఫోన్ 6.75 అంగుళాల పెద్ద HD+ నోచ్ డిస్‌ప్లేతో వస్తోంది. దీనిలో అందించిన 120Hz రీఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తుంది. దీంతోపాటు దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను కూడా ఇచ్చారు. ఇది చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉంటుంది.

మెరుగైన ప్రాసెసర్, స్టోరేజ్:

Advertisement

లావా బోల్డ్ N2 5G ఫోన్ ఆక్టాకోర్ యూనిసోక్ T8200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. అవసరాన్ని బట్టి వర్చువల్ ఫీచర్ ద్వారా మరో 4GB వరకు RAMను పెంచుకోవచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ మొబైల్‌లో ఎలాంటి అవాంఛిత యాప్స్ (బ్లోట్‌వేర్), యాడ్స్ ఉండకపోవడం విశేషం.

Also Read: నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీనిలోని 6000mAh భారీ బ్యాటరీ. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ త్వరగా ఎక్కడం కోసం 18W సపోర్ట్ ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనుకవైపు 13MP ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అమర్చారు.

ధర ఎంతంటే?

లావా బోల్డ్ N2 5G ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా.. ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద కేవలం రూ.11,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇది రీగల్ గోల్డ్, బిలియనీర్ బ్లూ రంగులలో లభిస్తుంది. అలాగే వినియోగదారుల కోసం లావా సంస్థ ఉచితంగా ‘సర్వీస్ @ హోమ్’ సౌకర్యాన్ని అందిస్తోంది. అంటే.. ఫోన్ ఏదైనా రిపేర్ వస్తే కంపెనీ ప్రతినిధులే ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు.

Also Read: పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×