E-Paper
Advertisement

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!
Advertisement

Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (శుక్రవారం) గుజరాత్‌లోని సూరత్, కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు ప్రాంతాలలో కలిపి సుమారు రూ. 21,770 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

ముందుగా సూరత్‌లో దాదాపు రూ. 18,800 కోట్ల రూపాయల విలువైన ప్రగతి పనులను ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఇందులో అత్యంత కీలకమైన 8-లేన్ల వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలోని కొన్ని ప్రధాన ప్యాకేజీలు ఉన్నాయి. దీనితో పాటు గిరిజన ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, ప్రపంచంలోనే ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి కనెక్టివిటీని పెంచేలా జాతీయ రహదారి (NH-56)లోని కొన్ని ముఖ్య విభాగాలను నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

Advertisement

ఆ తర్వాత డామన్‌ పర్యటనలో భాగంగా రూ. 2,970 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటిలో ముఖ్యంగా రూ. 1,340 కోట్లతో నిర్మించిన ‘నమో విమానాశ్రయం’ కొత్త టెర్మినల్ భవనంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘నమో ఆసుపత్రి’ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరగడమే కాకుండా, పర్యాటకం, వైద్య రంగాలు మరింత బలోపేతం కానున్నాయి.

Also Read: అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×