E-Paper
Advertisement

AI on World Destruction: 2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!

AI on World Destruction: 2026లో భూమి అంతం? దీనిపై AI ఏం చెప్పిందో తెలుసా? ఇది చదివితే ఆశ్చర్యపోతారు!
Advertisement

AI Prediction On 2026: గత కొన్ని నెలలుగా ఫోన్‌ లో, యూట్యూబ్‌ లో, వాట్సాప్ గ్రూపుల్లో ఒక్కటే మాట. ‘2026లో ప్రపంచం అంతం’. కొందరు భూమిని ఆస్టరాయిడ్ ఢీ కొనబోతోందంటారు. మరి కొందరు నోస్ట్రడామస్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఇంకొందరు జ్యోతిష్యంలో రాహు-కేతువులు ఏదో పెద్ద కాంబినేషన్‌ లోకి వచ్చేస్తున్నారంటారు. ఈ వార్తలను చూసి చాలా మంది కంగారు పడ్డారు. పడుతున్నారు కూడా. కానీ, కాస్త లోతుగా పరిశీలిస్తే, తేలిన అసలు నిజం ఏంటి? నాసా సైట్స్, జ్యోతిష్య పంచాంగాలు, పాత ప్రవచనాలు, సోషల్ మీడియా హైప్ మీద దాదాపు క్లారిటీ వచ్చింది.

ఈ భయం ఎక్కడి నుంచి మొదలైంది?

చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, ‘2026 డూమ్స్‌ డే’ టాక్ మొదటి నుంచీ ఒక్క కారణం మీదే నడుస్తోంది. 1980ల్లో బెంజమిన్ క్రెమ్ అనే వ్యక్తి  మైత్రేయ అలియాస్ కొత్త యుగం మెస్సయ్య రాబోతున్నాడని, 2025-2026లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం ఆస్టరాయిడ్‌ వైపు మళ్లింది. మరికొద్ది రోజులకు నోస్ట్రడామస్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగు జ్యోతిష్య చానెళ్లలో రాహు-కేతువులు హంగామా చేస్తున్నాయి. ఒక్కటే పాయింట్..  భయం వైరల్ అవుతుంది. వ్యూస్ వస్తాయి. డబ్బు వస్తుంది. బస్ అంతే!

ఆస్టరాయిడ్ నిజంగా ఢీకొనబోతోందా?

Advertisement

ఇంటర్నెట్‌ లో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోల్లో రెండు ఆస్టరాయిడ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ఒకటి Apophis (99942), రెండు 2024 YR4. Apophis 2029 ఏప్రిల్ 13న భూమికి 31,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. కానీ 2021లోనే నాసా 100% సేఫ్ అని ధృవీకరించింది. 2026లో దాని దూరం లక్షల కిలోమీటర్లు. 2024 YR4 లేదంటే ఇంకా ఏదైనా ఆస్టరాయిడ్ 2026లో ఢీకొనే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. నాసా, ESA, NEOWISE టెలిస్కోప్‌లు 99% పెద్ద ఆస్టరాయిడ్స్‌ ను ట్రాక్ చేస్తున్నాయి. ఏదైనా రిస్క్ ఉంటే ఇప్పటికే పెద్ద హెచ్చరికలు వచ్చేవి.

జ్యోతిష్యం ఏం చెప్తుంది?

జ్యోతిష్యం ప్రకారం 2026లో మూడు పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఒకటి.. శని మేషం నుంచి మీనంలోకి వస్తుంది. రెండు.. రాహు-కేతువులు 2025 మే నుంచి కుంభ-సింహ రాశుల్లోకి వస్తాయి. మూడు.. గురు 2026 మే నుంచి మిథునంలోకి రాబోతున్నాడు.  ఇవి కొంత ఉద్రిక్తతలు, ఆర్థిక సమస్యలు, సహజ విపత్తులను సూచిస్తున్నాయి అంటున్నారు పండితులు. కానీ,  ప్రళయం  అని ఒక్కరు కూడా చెప్పలేదు. యూట్యూబ్ ఛానెల్స్ లో మాత్రం ‘2026 మహా ప్రళయం’  అని థంబ్‌ నెయిల్ పెట్టి వీడియో చేసే వాళ్లు వ్యూస్ కోసమే అంత హైప్ చేస్తున్నారు.

2026 నిజంగా ఏం జరుగుతుంది?  

Advertisement

గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త కష్ట సంవత్సరం కావచ్చు. క్లైమేట్ చేంజ్ మరింత తీవ్రమవుతుంది. రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లాంటి ఘటనలు పెరగవచ్చు. AI వల్ల కొత్త రకం ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ, ఇవన్నీ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలే.  కొత్తగా ప్రపంచాన్ని నాశనం చేసేవి కావు.  చివరిగా.. గతంలో Y2K (2000), మయన్ క్యాలెండర్ (2012), కరోనా ‘ప్రపంచం అంతం’ టాక్ (2020) గురించి విన్నాం. ప్రతిసారీ భయపడ్డాం. కానీ, ఏమీ కాలేదు. 2026 కూడా అలాగే గడిచిపోతుంది. భయపడి జీవితం ఆపేయడం కంటే, రేపు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం మంచిది. ధైర్యంగా ఉండండి. 2026 కూడా మనం నవ్వుకునే, బతికే సంవత్సరమే అని గుర్తుంచుకోండి!

Read Also:  ఈ దేశంలో యుద్ధం వచ్చినా, విపత్తు వచ్చినా.. ఒక్క పౌరుడు కూడా చావడు, గ్రేట్ సెల్యూట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×