E-Paper
Advertisement

OTT Movie : పెళ్లంటే నూరేళ్ళ మంట… కళ్ళు తెరిపించే సెటైరికల్ డార్క్ కామెడీ చిత్రం

OTT Movie : పెళ్లంటే నూరేళ్ళ మంట… కళ్ళు తెరిపించే సెటైరికల్ డార్క్ కామెడీ చిత్రం
Advertisement

OTT Movie : పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే బదులు, పెళ్ళంటే నూరేళ్ళ మంట అనిపిస్తుంది ‘ది రోజెస్’ అనే ఈ సినిమాని చూస్తే. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ హాలీవుడ్ మూవీ, ఈ రోజు నుంచి ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ కథలో ఒకప్పుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంట… ఇప్పుడు డివోర్స్ కోసం ఒకరినొకరు చంపేసే లెవెల్‌కి వెళ్లిపోతారు. ఇదంతా చూస్తుంటే మొదట నవ్వు ఆపుకోలేరు, తర్వాత అమ్మో ఇలా కూడా జరుగుతాయా అని ఒళ్లు గగుర్పొడిచే విధంగా స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. ఈ సినిమా 1989లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ది వార్ ఆఫ్ ది రోజెస్కి’ కి రీమేక్ గా వచ్చింది. కానీ ఈసారి మరింత కుళ్లు డైలాగ్స్, మరింత డార్క్ హ్యూమర్, మరింత సైకో ట్విస్ట్‌లతో వచ్చేసింది. మొత్తానికి భార్యాభర్తలు ఒకరినొకరు రోడ్డున పడేసుకుంటే ఏం జరుగుతుందో చూడాలని ఉందా? అయితే ఈ సినిమాను చూసేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘ది రోజెస్’ అనే ఈ బ్లాక్ కామెడీ సినిమా జే రోచ్ దర్శకత్వంలో వచ్చింది. ఇది 1981లో వారెన్ అడ్లర్ రాసిన ది వార్ ఆఫ్ ‘ది రోజెస్’ నవల ఆధారంగా, 1989 ‘ది వార్ ఆఫ్ ది రోజెస్కి’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో బెనెడిక్ట్ కంబర్‌బాచ్, ఒలివియా కోల్‌మన్ జంటగా నటించారు. ది రోజెస్ యునైటెడ్ స్టేట్స్‌లో సెర్చ్‌లైట్ పిక్చర్స్ ద్వారా 2025 ఆగస్టు 29న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా $51 మిలియన్లను వసూలు చేసింది. ఈ సినిమా 2025 నవంబర్ 20 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

థియో ఇళ్లు డిజైన్ చేసే ఒక ఆర్కిటెక్ట్. ఐవీ రెస్టారెంట్ ఎంపైర్ కలలు కనే ఒక చెఫ్. ఇద్దరూ మొదటి చూపులోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ ప్రేమకు పండంటి పిల్లలు కూడా పుడతారు. వీళ్ళ లైఫ్ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఐవీ బిజినెస్ లో ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది. అయితే థియో కెరీర్ మాత్రం బాగా డౌన్ అవుతుంది. ఇక వీళ్ళ మధ్య ఈర్ష్య, అహంకారం మొదలవుతుంది. వీటి వల్ల చిన్న చిన్న గొడవలు మొదలై పెద్దవి అవుతాయి. డివోర్స్ తెసుకుందాం అనే వరకు వీళ్ళ మాటల యుద్దం మొదలవుతుంది. ఇల్లు ఎవరిది? డబ్బు ఎవరిది? పిల్లలు ఎవరితో? అనే ప్రశ్నలు వస్తాయి. ఒకరినొకరు టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు.

Read Also : గ్రామానికి శాపం… ఐఏఎస్ ఆఫీసర్‌కు చెమటలు పట్టించే దెయ్యాలు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి

మొదట జోకులు, సూటి పోటీ మాటలతో మొదలై, తర్వాత ఫుడ్‌లో విషం కలపడం, ఇల్లు ధ్వంసం చేయడం… ఇలా ఒక్కో స్టెప్ ఎక్కుతూ సైకో లెవెల్‌కి వెళ్తారు. ఇందులో కేట్ అనే మహిళ మధ్యలో థెరపిస్ట్‌గా వచ్చి నవ్వులు పూయిస్తుంది. ఆండీ అనే లాయర్‌ స్టోరీకి మరింత చిక్కదనాన్ని ఇస్తాడు. చివరికి ఈ జంట కలసి ఉంటారా ? ఇగోతో విడిపోతారా ? అనే విషయాలను, ఈ బ్లాక్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×