E-Paper
Advertisement

Linux Phone: ప్రైవసీలో ఐఫోన్‌కు మించిన కొత్త ఫోన్ లాంచ్.. స్పెషల్ ఫీచర్లు ఇవే..

Linux Phone: ప్రైవసీలో ఐఫోన్‌కు మించిన కొత్త ఫోన్ లాంచ్.. స్పెషల్ ఫీచర్లు ఇవే..
Advertisement

Jolla Linux Phone| ఫిన్లాండ్ దేశానికి చెందిన టెక్ కంపెనీ జొల్లా (Jolla) తాజాగా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. కేవలం ప్రైవసీ కోసమే ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసమే ప్రత్యేకంగా ఈ ఫోన్‌ని రూపొందించారు. దీని పేరు జొల్లా లినక్స్ ఫోన్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. ఈ ఫోన్ 2013లో ఒక స్పెషల్ ఫోన్ విడుదల చేసిన జొల్లా దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ కొత్త ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో బ్యాటరీ, బ్యాక్ కవర్ మీరే మార్చుకోవచ్చు. మూడు అందమైన కలర్స్‌లో లభిస్తుంది.

ధర, ప్రీ-ఆర్డర్ ఎలా ఉన్నాయి?

ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేయాలంటే ముందుగా €99 (భారత కరెన్సీలో సుమారు రూ.10,000) డిపాజిట్ ఇవ్వాలి. ఫోన్ షిప్పింగ్ సమయంలో మొత్తం €499 (సుమారు రూ.52,284) చెల్లించాలి. రిటైల్ ధర €599 – €699 (రూ.62,000 – రూ.73,000) వరకు ఉంటుంది. ప్రీ-ఆర్డర్ చేసినవాళ్లకి స్పెషల్ ఎడిషన్ బ్యాక్ కవర్ ఉచితం. 2026 సంవత్సరం మధ్యలో షిప్పింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా యూరోపియన్ దేశాల్లోనే సేల్స్ ప్రారంభమవుతాయి.

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయి?

Advertisement

ఈ కొత్త లినక్స్ ఫోన్‌లో 6.36 అంగుళాల ఫుల్ HD+ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ చాలా షార్ప్‌గా అందంగా కనిపిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. మిడియా టెక్ 5G ప్లాట్‌ఫాం ఉంది. ఫాస్ట్ ఇంటర్నెట్, 5G సపోర్ట్ ఉంటుంది.

హై స్పీడ్ ర్యామ్, స్టోరేజ్

12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డు పెట్టి 2TB వరకు పెంచుకోవచ్చు. మల్టీటాస్కింగ్ సూపర్ స్మూత్‌గా ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటి?

Advertisement

ఇతర ఫోన్లలాగా ఇందులో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ లేదు. గూగుల్ లేదు. ఈ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ పేరు సెయిల్‌ఫిష్ ఓఎస్ (Sailfish OS) 5. ఇది లినక్స్ ఆధారిత, పూర్తి ప్రైవసీ ఫోకస్డ్ OS. గూగుల్ సర్వీసెస్ లేకుండానే అన్ని యాప్స్ రన్ అవుతాయి.

బ్యాటరీ, ప్రైవసీ ఫీచర్స్ ఏమిటి?

ఫోన్‌లో పెద్ద 5500mAh బ్యాటరీ ఉంది. రెండు రోజులు సులువుగా నడుస్తుంది. ఫోన్‌లో ఫిజికల్ ప్రైవసీ స్విచ్‌లు ఉన్నాయి. కెమెరా, మైక్ ఆఫ్ చేయొచ్చు. ఫోన్ పొడవు 158mm, మందం 9mm. చేతిలో పట్టుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది.

కెమెరా, కనెక్టివిటీ ఎలా ఉంది?

వెనుకవైపు 50MP మెయిన్ + 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. 5G, Wi-Fi 6, బ్లూటూత్ – లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి.

ఎందుకు ఈ ఫోన్ ప్రత్యేకం?

బ్యాటరీ, బ్యాక్ కవర్ మీరే మార్చుకోవచ్చు
గూగుల్ లేని పూర్తి ప్రైవసీ OS
ఇందులోని ఫిజికల్ ప్రైవసీ స్విచ్‌లు
ఫోన్ హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం

ఫోన్‌లో అన్నింటికంటే ప్రైవసీ మీకు ముఖ్యమైతే, గూగుల్-ఆండ్రాయిడ్ నుంచి దూరంగా ఉండాలనుకుంటే ఈ జొల్లా ఫోన్ బెస్ట్ ఆప్షన్! 2026 వరకు వేచి ఉండి ప్రీ-ఆర్డర్ చేసుకోండి.

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏజెంటిక్ AI  స్మార్ట్‌ఫోన్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×