E-Paper
Advertisement

అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!

అస్సలు మిస్ అవ్వకండి.. ఉచితంగా 20GB డేటా ఇస్తున్న జియో!
Advertisement

Jio Offer: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరో అదిరిపోయే ఆఫర్‌ను తీసుకువచ్చింది. రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనంగా 20GB బోనస్ డేటాను అందిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకుంటూ ఎక్కువ డేటా వాడే యూజర్లను ఆకట్టుకోవడానికి జియో ఈ బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రూ. 899 ప్లాన్ బెనిఫిట్స్

సాధారణంగా జియో అందించే రూ. 899 ప్లాన్ కాలపరిమితి 90 రోజులు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వాలిడిటీ కాలానికి గానూ 180GB డేటా అందుతుంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

20GB బోనస్ డేటా ఎలా లభిస్తుంది?

Advertisement

తాజా ఆఫర్ కింద జియో ఈ ప్లాన్‌పై అదనంగా 20GB డేటా వోచర్‌ను ఉచితంగా ఇస్తోంది. దీనివల్ల యూజర్లకు లభించే మొత్తం డేటా 180GB నుండి 200GBకి పెరుగుతుంది. ఈ బోనస్ డేటాకు ఎలాంటి రోజువారీ పరిమితి ఉండదని జియో వర్గాలు తెలిపాయి. రోజువారీ 2GB కోటా అయిపోయిన తర్వాత ఈ 20GB నుండి హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చని సూచించాయి.

అదనపు ప్రయోజనాలు

రూ. 899 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా జియో యాప్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. జియో సినిమా యాప్ లో ఉచితంగా సినిమాలు, సిరీస్‌లు చూసే అవకాశం పొందొచ్చు. అలాగే జియో టీవీ ద్వారా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. జియో క్లౌడ్ తో ఫోటోలు, ఫైల్స్ దాచుకోవడానికి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ను సైతం జియో ఆఫర్ చేస్తోంది.

అపరిమిత 5G డేటా కూడా..!

Advertisement

మీరు ఉండే ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండి.. మీ వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఈ ప్లాన్‌తో మీరు అపరిమిత 5G డేటాను ఫ్రీగా వాడుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని జియో వర్గాలు వెల్లడించాయి.

Also Read: క్రోమా నమ్మశక్యం కాని ఆఫర్.. సగం ధరకే సరికొత్త ‘ఐఫోన్ 17’.. చార్జర్ కూడా ఫ్రీ!

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

జియో రూ.899 ప్లాన్ పొందేందుకు వివిధ రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ‘మై జియో’ యాప్ ద్వారా గానీ, జియో అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర డిజిటల్ పేమెంట్ యాప్స్ (PhonePe, Google Pay, Paytm) ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ పూర్తయిన తర్వాత బోనస్ డేటా మీ అకౌంట్‌లో యాడ్ అవుతుందని జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: ఫోన్ పోగొట్టుకుంటే.. తొలి 15 నిమిషాల్లో చేయాల్సిన.. 5 అత్యవసర పనులు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×