E-Paper
Advertisement

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Wagon R Flex Fuel launch: భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. మారుతి సుజుకి తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ కారును జూన్ 4న ఆవిష్కరించేందుకు రెడీ అయ్యింది. ఈ కారు ప్రత్యేకతతలు ఏంటి? ఏ ఇంధనంతో నడుస్తుంది? ఎంత మైలేజ్ ఇస్తుంది? అనే వివవరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ఈ కారు సాధారణ పెట్రోల్‌ తో పాటు అధిక ఇథనాల్ మిశ్రమాలతో కూడా నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  పర్యావరణహిత రవాణా వైపు భారత్ వేస్తున్న అడుగుల్లో ఈ మోడల్‌ కు ప్రత్యేక స్థానం దక్కే అవకాశం ఉంది.

Advertisement

⦿ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని ఇప్పటికే పలు దేశాలు ఉపయోగిస్తున్నప్పటికీ, భారత మార్కెట్లో మాస్ మార్కెట్ స్థాయిలో అందుబాటులోకి వస్తున్న తొలి వాహనాల్లో వాగన్ ఆర్ ఒకటి. అందుకే ఈ కారు విడుదలపై ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి నెలకొంది.

⦿ వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు సాధారణ పెట్రోల్‌తో పాటు E20, E85, పూర్తిగా ఇథనాల్‌ తో కూడిన E100 ఇంధనంపై కూడా నడుస్తుంది. డ్రైవర్లు అందుబాటులో ఉన్న ఇంధనాన్ని బట్టి వాహనాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు పొందుతారు. దీంతో భవిష్యత్తులో పెట్రోల్‌పై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ ఈ కారులో మరో ముఖ్యమైన అంశం ఉద్గారాల తగ్గింపు. అధిక ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించినప్పుడు సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే కాలుష్య ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. కంపెనీ అంచనాల ప్రకారం, E85 ఇంధనంతో నడిపినప్పుడు ఉద్గారాలు 79 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉంటుంది.

⦿ పర్యావరణ ప్రయోజనాల కోసం పనితీరు తగ్గుతుందనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే మారుతి సుజుకి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ కూడా సాధారణ 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించేలా రూపొందించబడింది.

⦿ ఈ కారులో ఆధునిక సెన్సార్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఫ్యూయల్ ట్యాంక్‌ లో ఎంత శాతం ఇథనాల్ ఉందో ప్రత్యేక సెన్సార్లు గుర్తిస్తాయి. దానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును ఆటోమేటిక్ గా అడ్జెస్ట్ అవుతుంది. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.

⦿ ఇథనాల్ ఇంధనంతో వాహనాలను స్టార్ట్ చేయడంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాగన్ ఆర్‌ లో హీటెడ్ ఫ్యూయల్ రైల్స్‌ ను అమర్చారు. చల్లని వాతావరణ పరిస్థితుల్లో కూడా వాహనం సులభంగా స్టార్ట్ అయ్యేలా ఈ వ్యవస్థ సహాయపడుతుంది.

⦿ అలాగే ఇథనాల్ వినియోగానికి అనుగుణంగా ఇంజిన్‌ లోని పలు భాగాలను మరింత బలంగా రూపొందించారు. ప్రత్యేక ఫ్యూయల్ పంపులు, తుప్పు రాని ఇంజెక్టర్లు, దీర్ఘకాలిక వినియోగానికి అనువైన భాగాలను ఉపయోగించారు. దీంతో వాహనం ఎక్కువ కాలం నమ్మకంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

భారత ప్రభుత్వం ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెరిగితే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుంది.  తగ్గింపు లక్ష్యాలకు కూడా సహాయపడతాయి.

Read Also: ఎలక్ట్రిక్ To లగ్జరీ వరకు.. జూన్ 2026లో మార్కెట్ ను షేక్ చేయబోతున్న క్రేజీ SUVలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×