E-Paper
Advertisement

జియో యూజర్లకు పండగే.. రూ.798కే 100 Mbps స్పీడ్.. ఫ్రీ Zee5 సబ్‌స్క్రిప్షన్!

జియో యూజర్లకు పండగే.. రూ.798కే 100 Mbps స్పీడ్.. ఫ్రీ Zee5 సబ్‌స్క్రిప్షన్!
Advertisement

Jio Broadband Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు రూ. 798 (ట్యాక్స్ అదనం) ధరతో లభించే ఈ ప్లాన్ ద్వారా.. ఓటీటీ ప్రయోజనాలు, ఫిఫా వరల్డ్ కప్ ను వీక్షించే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. వినోదాన్ని ఎక్కువగా కోరుకునే కుటుంబాలకు ఈ ప్లాన్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుందని చెప్పవచ్చు. అయితే ఇది నెలవారీ రీఛార్జ్ చేసుకునే రెగ్యులర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కాదు. కేవలం ఒక ‘డేటా సాచెట్’ (Data Sachet) మాత్రమే అని జియో వర్గాలు స్పష్టం చేశాయి.

అసలేంటీ ‘డేటా సాచెట్’?

సాధారణంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రోజువారీ లేదా నెలవారీ FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటా లిమిట్ అయిపోయినప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను నిరంతరాయంగా వాడుకోవడానికి ఈ డేటా సాచెట్లు ‘డేటా బూస్టర్’లా సహాయపడతాయి.

రూ. 798 ప్లాన్ బెనిఫిట్స్

Advertisement

ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న జియోఫైబర్ లేదా ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌పై ఈ రూ. 798 ప్లాన్‌తో అదనపు రీఛార్జ్ చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్ కు కొన్ని బెనిఫిట్స్ కలుగనున్నాయి. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 40 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ డేటాను 100 Mbps వేగంతో వాడుకోవచ్చు. కాగా, ఈ డేటా ఈ డేటా సాచెట్ వాలిడిటీ 40 రోజులుగా జియో ప్రకటించింది.

Also Read: మండిపోతున్న యూరప్.. కానీ ఇళ్లలో ఏసీలు లేవు.. ఎందుకో తెలుసా?

ZEE5 సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ

Advertisement

ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా ZEE5 సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్, జీ5 కంటెంట్ ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ తర్వాత జీ5 క్లెయిన్ చేసుకునేందుకు.. మై జియో యాప్ లోకి వెళ్లి కూపన్ సెక్షన్ ను క్లిక్ చేయండి. అక్కడ మై విన్నింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసి.. జీ5 ఉచిత సబ్ స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకోండి.

Also Read: ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×