E-Paper
Advertisement

‘హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!

‘హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Minister Ponguleti: మాజీ మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయ‌న‌కు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింద‌నే అనుమానం క‌లుగుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అన్నారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో మంత్రి మాట్లాడారు. ద‌మ్ముంటే అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌న్న‌ హ‌రీష్ రావు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్ర‌జానీకం తమకు ఐదేళ్ల‌కు అధికార‌మిచ్చారని గుర్తు చేశారు. రెండున్న‌రేళ్ల‌కే ఎందుకు అసెంబ్లీని ర‌ద్దు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉందని స్పష్టం చేశారు.

గత రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌ల తీర్పు ఏవిధంగా ఉందో హ‌రీష్‌రావుకు తెలుసని పొంగులేటి అన్నారు. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే తీర్పు ఏముందిని ప్రశ్నించారు. రెండుకాళ్లు లేనివాడు చూసుకుందాం రా అని స‌వాలు విసిరిన‌ట్లే బీఆర్ఎస్ నాయ‌కుల స‌వాళ్లు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసే మంచిప‌నుల‌ను జీర్ణించుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. భ‌విష్య‌త్తులో అధికారం ద‌క్క‌ద‌నే ఆవేశం, ఆక్రోశంతో అటు కేటీఆర్ సైతం ఉక్రోషాన్ని వెళ్ల‌గ‌క్కుతున్నారన్నారు. తన నియోజ‌క‌వ‌ర్గం పాలేరులో కేటీఆర్ విమ‌ర్శ‌లు ఇదే కోవ‌లోకి వ‌స్తాయన్నారు.

Advertisement

బీఆర్ఎస్ నాయ‌కులు చేసే చిల్ల‌ర విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిసారీ స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఎప్పుడో ఒక‌సారి క‌చ్చితంగా క‌ర్ర కాల్చి వాత పెడ‌తానని నొక్కిచెప్పారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలిన‌ట్టుకాదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్ర‌జ‌లు ఛీ కొట్టినా బాంబులు ప‌డ్డ‌ట్టే అని మంత్రి వివరించారు. ఏ వ్య‌క్తిమీదా వ్య‌క్తిగ‌త క‌క్ష‌పూరిత‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ఆలోచ‌న ఈ ప్ర‌భుత్వానికి లేదన్నారు. త‌ప్పుచేసిన వాళ్ళ‌ను జైలులో వేస్తేనే శిక్షించిన‌ట్లు కాదన్నారు. ప్ర‌తి ఎన్నిక‌ల్లో వాళ్ల‌ను ఓడించి ప్ర‌జ‌లు శిక్షిస్తూనే ఉన్నారన్నారు. త‌మిళ‌నాడు లాంటి ప‌రిస్ధితి ఈ రాష్ట్రంలో రాదని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు.

Also Read: జియో యూజర్లకు పండగే.. రూ.798కే 100 Mbps స్పీడ్.. ఫ్రీ Zee5 సబ్‌స్క్రిప్షన్!

Advertisement

మరోవైపు అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ ప‌గ‌టిక‌ల‌లు కంటోందని పొంగులేటి విమర్శించారు. ఆశ ఉండ‌డంలో త‌ప్పులేదు కానీ ఆ పార్టీ అత్యాశ‌కు పోతోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ రాని పార్టీ అధికారం గురించి ఆశ ప‌డుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మంత్రి ఆరోపించారు. కాళేశ్వ‌రం అవినీతి, ధ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ చేయాల‌ని అడిగితే బిజేపీ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదన్నారు.

Also Read: ఆఫర్ అంటే ఇది కదా.. Amazon SAleలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% డిస్కౌంట్.. ఏ మోడల్ ఎంతంటే?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×