E-Paper
Advertisement

జియో vs ఎయిర్‌టెల్.. 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్.. ఏ ప్లాన్ బెస్ట్ అంటే?

జియో vs ఎయిర్‌టెల్.. 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్.. ఏ ప్లాన్ బెస్ట్ అంటే?
Advertisement

Recharge Plans: దేశంలో అత్యధిక యూజర్లను కలిగిన దిగ్గజ టెలికాం కంపెనీల్లో జియో, ఎయిర్ టెల్ ఒకటి. రీఛార్జ్ ప్లాన్ల విషయంలో ఈ బడా కంపెనీల మధ్య ఎప్పుడూ రసవత్తరమైన పోరు నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ లోని ప్రీపెయిడ్ ప్లాన్ల విషయంలో ఇవి ఎప్పటికప్పుడు బెస్ట్ ప్లాన్స్ ను తీసుకొస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే జియో రూ. 448 ప్లాన్‌, ఎయిర్‌టెల్ రూ. 469 ప్లాన్‌ను ప్రవేశపెట్టాయి. ఈ రెండూ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటాయి. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మంచిదో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జియో రూ.448 ప్లాన్

జియో ఈ ప్లాన్ ను వాయిస్ కాల్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించింది. ఇందులో ఎలాంటి రోజువారీ డేటా లభించదు. ఫ్రీ కాల్స్ తో పాటు 84 రోజుల వ్యాలిడిటీతో 1000 ఎస్ఎంఎస్ లు యూజర్ కు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ పై కొన్ని అదనపు బెనిఫిట్స్ ను సైతం జియో ఆఫర్ చేస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కు ఉచిత యాక్సెస్ ను అందిస్తోంది. ఒకవేళ నేట్ అవసరమైన వాళ్లు.. ఈ ప్లాన్ తో పాటు డేటా వోచర్స్ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని జియో వర్గాలు చెబుతున్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 469 ప్లాన్

Advertisement

జియోకు పోటీకు ఎయిర్ టెల్ సైతం రూ.469లో వాయిస్ ఓన్లీ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లను ఫ్రీగా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ల పరిమితి దాటితే.. లోకల్ దానికి రూ.1, STD మెసేజ్ కు రూ.1.5 ఛార్జ్ చేయనున్నారు. అయితే ఈ ప్లాన్ లోనూ ఎయిర్ టెల్ కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. 3 నెలల అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హెలోట్యూన్స్ యూజర్లు పొందొచ్చు.

Also Read: ఒడిలోని ల్యాప్‌టాప్.. జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

ఫైనల్గా ఏది బెస్ట్?

Advertisement

ధర విషయానికి వస్తే.. ఎయిర్‌టెల్ కంటే జియో ప్లాన్ రూ. 21 తక్కువకే లభిస్తోంది. అలాగే జియోలో 100 ఎస్ఎంఎస్ లను అదనంగా పొందొచ్చు. కాబట్టి తక్కువ ఖర్చులో మంచి ప్లాన్ కావాలనుకుంటే జియో బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. అలా కాకుండా అపోలో హెల్త్ బెనిఫిట్స్, ఫ్రీ హలో ట్యూన్స్ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ. 469 ప్లాన్ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే మీ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ సిగ్నల్, కాలింగ్ క్వాలిటీ బాగుంటుందో చూసుకొని నిర్ణయం తీసుకోవడం మంచింది.

Also Read: దీదీకి భారీ ఎదురు దెబ్బ.. అత్యంత ఆప్తురాలి రాజీనామా.. రెబల్ నేతతో కీలక భేటి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×