E-Paper
Advertisement

Annam Foundation: కేసముద్రం బడి తండాలో హార్ట్ టచింగ్ సీన్.. బిగ్ టీవీ వార్తతో యువకుడికి పునర్జన్మ!

Annam Foundation: కేసముద్రం బడి తండాలో హార్ట్ టచింగ్ సీన్.. బిగ్ టీవీ వార్తతో యువకుడికి పునర్జన్మ!
Advertisement

Annam Foundation: నా అనే వారు లేరు. ముళ్ల చెట్టే 30 ఏండ్ల యువకుడికి ఆశ్రయం అయింది. అయితే పక్షవాతంతో అనాథ గా మారి నిస్సహాయంగా జీవనం సాగిస్తున్న వినోద్‌ అనే వ్యక్తి పై BIG TV లో ప్రసారం అయిన వార్త పై అన్నం ఫౌండేషన్ మానవత్వంతో స్పందించింది. ఆయనకు పక్షవాతం కారణంగా రెండు కాళ్లు, చేతులు, నోరు పనిచేయని స్థితికి చేరుకున్న వినోద్ అటు సమాజానికి దూరమై, జీవితం, మరణం మధ్య పోరాటం చేస్తూ కేసముద్రం మున్సిపాలిటీలోని బడి తండాలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించాడు. దీంతో వినోద్ పరిస్థితి గురించి తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకుని, నీవు ఒంటరివి కాదు. మేమున్నాం అనే భరోసా కల్పించారు. అపరిశుభ్రంగా, అనారోగ్యంతో, చెత్త కుప్పల్లో చెట్టు కింద ఉన్న ఆయనకు ప్రేమగా సపర్యలు చేసి, స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించారు.

ప్రేమతో చేయూత..

అనంతరం ఆహారం అందించి, మెరుగైన వైద్య చికిత్స, సంరక్షణ కోసం ఖమ్మం జిల్లాకు తరలించారు. ఒక నిరాధారుడి కళ్లలో మళ్లీ ఆశ వెలిగించిన అన్నం ఫౌండేషన్ సేవలు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెను కదిలించాయి. రక్తసంబంధాలు దూరమైన చోట మానవత్వమే బంధువుగా మారి, ప్రేమతో చేయూతనిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పడానికి ఈ సంఘటనే నిదర్షనం. నిరాధారులు, అనాథలు, ఆపన్నులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తున్న అన్నం ఫౌండేషన్ సేవలను స్థానికులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దేవేందర్ అరుణ పాల్గొన్నారు.

Advertisement

Also read: గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య

BIG TVకి కృతజ్ఞతలు: కౌన్సిలర్ బాణోత్ అరుణ దేవేందర్

ఎవరు లేని అనాధ యువకునికి బిగ్ టీవీ బతుకు దారిని చూపింది. BIG TV లో ప్రసారమైన వార్తను చూసి అనాధాశ్రమం వారు తీసుకెళ్లారు. గిరిజనుల పక్షాన, పేద ప్రజల పక్షాన బిగ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చెట్టు కింద ఉన్న ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన యువకునికి అండగా బిగ్ టీవీ నిలిచింది. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం బిగ్ టీవీ. కేవలం టిఆర్పి రేటింగ్ కోసం వివిధ ఛానల్స్ పోటీ పడుతున్న రోజుల్లో ఒక సాధారణమైన వ్యక్తిపై వార్త ప్రసారం చేయడం అభినందనీయం అని అందూ కొని యాడారు.

Advertisement

Also read: Illegal Mining: గద్వాల్లో మట్టి మాఫియా అరాచకం.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×