E-Paper
Advertisement

Jio Recharge Plans: జియో గేమ్ ఛేంజర్.. కొత్త రిచార్జ్ ప్లాన్స్‌తో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కు టెన్షన్

Jio Recharge Plans: జియో గేమ్ ఛేంజర్.. కొత్త రిచార్జ్ ప్లాన్స్‌తో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కు టెన్షన్
Advertisement

Jio Recharge Plans| భారత దేశంలో దాదాపు 50 కోట్ల మంది యూజర్లను రిలయన్స్ జియో కలిగి ఉంది. ఇప్పుడు జియో పూర్తిగా లాంగ్ టర్మ్ రీచార్జ్ ప్లాన్‌లపై దృష్టి పెట్టింది. జియో కొత్త ప్లాన్స్ తో కోట్ల మంది మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. అదే సమయంలో ఈ ప్లాన్ రావడంతో జియో పోటీదారులు అయిన ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఇండియా (Vi)పై ఒత్తిడి పెరిగిపోయింది.

లాంగ్ టర్మ్ ప్లాన్స్ మీద జియో పూర్తి ఫోకస్

జియో ఇప్పుడు 84 రోజుల కంటే ఎక్కువ వాలిడిటీ ఉన్న ప్లాన్‌లనే ఎక్కువ చేసింది. ఇందులో 90 రోజులు, 98 రోజులు, 200 రోజులు, 336 రోజులు, 365 రోజుల ప్లాన్‌లు ఉన్నాయి. యూజర్లు ప్రతి నెలా రీచార్జ్ టెన్షన్ నుంచి బయటపడొచ్చు. ఒకేసారి పూర్తిగా ఏడాదికి ఒకేసారి రీచార్జ్ చేస్తే చాలు.

రూ.3,599 యాన్యువల్ ప్లాన్ సూపర్ హిట్

Advertisement

జియో రూ.3,599కే అద్భుతమైన ఏడాది ప్లాన్ ఇస్తోంది. ఈ వార్షిక ప్యాకేజీ ప్లాన్ లో లభించే బెనిఫిట్స్ ఇవే..

  • పూర్తి 365 రోజుల వాలిడిటీ
  • అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్
  • రోజుకు 100 ఉచిత SMS
  • ప్రతిరోజు 2.5 GB హై స్పీడ్ డేటా (మొత్తం 912 GB)
  • ట్రూ 5G ఉచితం

365 రోజులకు రూ.3599 రీఛార్జ్ ధర అంటే సగటున రోజుకు రూ.9.86 మాత్రమే చెల్లించాలి. లభించే బెనిఫిట్స్, 365 వ్యాలిడిటీకి ఇది చాలా తక్కువ ధర అనే చెప్పాలి.

Advertisement

200 రోజుల సూపర్ ప్లాన్ – రూ.2,025 మాత్రమే
ఏడాది ప్లాన్ కాస్త ఖరీదుగా అనిపిస్తే జియో మరో బెస్ట్ ఆప్షన్ ఇచ్చింది. 200 రోజుల రిఛార్జ్ ప్లాన్ ధర రూ.2,025. ఇందులో కూడా:

  • అన్‌లిమిటెడ్ కాలింగ్ అన్ని నెట్‌వర్క్‌లకు
  • రోజుకు 2.5 GB డేటా
  • ట్రూ 5G ఉచితం
  • ఉచిత SMS
  • ఆరు నెలలు టెన్షన్ ఫ్రీ
  • రూ.2025 రీఛార్జ్ ధర అంటే సగటున రోజుకు దాదాపు రూ.10 మాత్రమే

ఎయిర్‌టెల్, వొడాఫోన్ పై తీవ్ర ఒత్తిడి

జియో ఇచ్చిన ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ వల్ల ఎయిర్‌టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ (BSNL) యూజర్లు ఆలోచనలో పడ్డారు. ఇంత వాల్యూ ఇచ్చే ప్లాన్స్ ఇతర టెలికాం కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. ఇప్పుడు ఎయిర్‌టెల్, ఇతర సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్‌లు తీసుకురాకపోతే వారి యూజర్లు జియోకు పోర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. విశ్లేషకులు అంచనా ప్రకారం.. జియో లాంగ్ టర్మ్ ప్లాన్స్ లో టెలికాం మార్కెట్లో పోటీ మరింత తీవ్రమైంది.

ప్రతినెలా రిఛార్జ్ టెన్షన్ లేదు

ఇకపై యూజర్లు ప్రతి నెలా “రీచార్జ్ డేట్ ఎప్పుడు?” అని గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఏడాది మొత్తం లేదా 200 రోజులు సర్వీస్ ఆగదు. ఖర్చు కూడా ఫిక్స్, బడ్జెట్ ప్లానింగ్ సులభం. జియో యూజర్లకు ఇది నిజమైన గిఫ్ట్!

మీకు ఏ ప్లాన్ సరిపోతుంది?

ముందు మీ నెలవారీ డేటా వినియోగం ఎంత అనేది లెక్క చేయండి. రోజుకు ఎక్కువ డేటా అంటే 2 లేదా 3 GB వినియోగించే వాళ్లకు రూ.3,599 ప్లాన్ పర్ఫెక్ట్. కొంచెం తక్కువ డేటా వినియోగించేవారికి రూ.2,025 ప్లాన్ సరిపోతుంది. రోజుకు సగటున ఖర్చు లెక్క వేసి చూస్తే జియో ప్లాన్స్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

జియో ఈ వ్యూహంతో మార్కెట్ లీడర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసింది. ఇకపై ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ప్లాన్స్ తీసుకొస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Also Read: మనిషిని చూడగానే పేరు, ఉద్యోగం, అడ్రస్ చెప్పేస్తున్న ఏఐ గ్లాసెస్.. ప్రమాదంలో ప్రైవెసీ..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×