E-Paper
Advertisement

Jio New Plan: ఏకంగా 200 రోజుల వ్యాలిడిటీ.. జియో క్రేజీ ప్లాన్ వచ్చేసింది!

Jio New Plan: ఏకంగా 200 రోజుల వ్యాలిడిటీ.. జియో క్రేజీ ప్లాన్ వచ్చేసింది!
Advertisement

భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద యూజర్ బేస్ ను కలిగి ఉంది. రోజు రోజుకు తన యూజర్లను పెంచుకుంటూ ఎదురులేని శక్తిగా ఎదుగుతోంది. ఇక తన యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు కొత్త వినియోగదారులను సంపాదించుకునేలా ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇతర టెలికాం సంస్థలకు సాధ్యం కాని రీతిలో నయా ప్లాన్స్ ను పరిచయం చేస్తుంది. ఆయా వినియోగదారులకు అనుగుణంగా తక్కువ ధరతో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ తో పాటు, హై-ఎండ్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందిస్తుంది. ఇక తాజాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘ కాల వ్యాలిడిటీతో చౌక రీఛార్జ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

365 రోజుల వ్యాలిడిటీకి ప్రత్యామ్నాయంగా..

ఇప్పటికే జియో 365 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఎక్కువ ధర కారణంగా ఆ రీఛార్జ్ ప్లాన్ ను తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలోకి కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర రూ. 2025గా నిర్ణయించింది. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కు ప్రత్యామ్నాయంగా దీనిని పరిచయం చేసింది.  ఇప్పటి వరకు ఉన్న జియో ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా అనౌన్స్ చేసింది.

రూ. 2025 ప్లాన్ తో లభించే బెనిఫిట్స్ ఇవే!

Advertisement

జియో వినియోగదారులకు ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ద్వారా బోలెడు బెనిఫిట్స్ అందిస్తుంది. రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకున్న వారికి 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాల్స్ చేసుకనే అవకాశం ఉంటుంది. అటు 200 రోజుల పాటు వినియోగదారులకు 500 జీబీ డేటాను అందిస్తుంది. అంటేప్రతి రోజు 2.5 జీబీ డేటాను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను పొందే అవకాశం ఉంటుంది.

Read Also: బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మొబైల్ లవర్స్ కొనవలసిన టాప్ 3 ఫోన్లు ఇవే..

రూ. 2025 ప్లాన్ తో అదనపు ప్రయోజనాలు

Advertisement

రూ. 2025 ప్లాన్ రీఛార్జ్ చేసుకు వినియోగదారులకు జియో అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది.

Read Also: ఎలాంటి షరతులు వర్తించవు.. అమెజాన్‌లో ఐఫోన్ 15పై ఆశ్చర్యపరిచే డిస్కౌంట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×